యువ

నవ్వుతూ నడపాలిరా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పటి సంగతేమో కానీ, కంప్యూటర్, ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు జీవితాన్ని ఊహించుకోలేం. అంతలా కంప్యూటర్ మన జీవన విధానంలో భాగమైపోయింది. ప్రపంచం ఒక్క క్లిక్ దూరంలో ఉంది అన్నది అందుకేనేమో! ఇదంతా బాగానే ఉంది కానీ, మరి దివ్యాంగుల సంగతేమిటి? మల్టిపుల్ స్ల్కెరోసిస్, మస్కులార్ డిస్ట్ఫ్రొ, ఏఎల్‌ఎస్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడేవారు వౌస్‌ను సైతం క్లిక్ చేయలేరు. అలాంటివారు కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడమెలా? ఈ ప్రశ్నకు సమాధానంగా స్మైల్ వౌస్ అనే టెక్నాలజీ త్వరలో వాడుకలోకి రాబోతోంది. ఇది హాండ్స్ ఫ్రీ, వాయిస్ ఫ్రీ, టచ్ ఫ్రీ టెక్నాలజీ. కేవలం పెదాల కదలిక, ముఖ కవళికలను బట్టి కర్సర్ కదుల్తుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే క్లిక్, స్క్రోల్, డ్రాగ్...ఇలాంటివన్నీ ముఖ కవళికలతోనే చేయొచ్చు. విండోస్ 7 వెర్షన్‌లో స్మైల్ వౌస్ పనిచేస్తుందట.