యువ

తొక్కే కదాని తీసేయకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల... కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అదే అందం విషయానికొస్తే నారింజ తొక్క, యాపిల్ ముక్క, అలొవెరా చుక్క కూడా అనర్హం కావు. మిగతా రెండింటి మాటా ఎలా ఉన్నా నారింజ తొక్కలో మాత్రం అందాన్ని ద్విగుణీకృతం చేసే గుణాలు చాలానే ఉన్నాయట. విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని మెరిసేలా చేయడంలో వీటి పాత్రే కీలకం. మొటిమలు రాకుండా చేయడమే కాదు, నారింజ తొక్కలో ఉండే పెక్టిన్ అనే ప్రొటీన్ వల్ల చర్మం నునుపెక్కుతుందట. నారింజ తొక్కలను ఎండబెట్టి, వాటిని పొడిగా చేసి, ఆ పొడిని కాసిని పాలు, పెరుగుతో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తే అందం మీ సొంతం. కాబట్టి.. తొక్కే కదాని తీసిపారేయకండి!