యువ

నాన్నకు ప్రేమతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖలో గత నెలలో జరిగిన భారత్-న్యూజీలాండ్ వనే్డ మ్యాచ్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అందులో మన ఆటగాళ్లు తమ తల్లుల పేర్లు రాసి ఉన్న జెర్సీలు ధరించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ధోని జెర్సీపై దేవకి పేరు కనిపిస్తే, రహానే జెర్సీపై సుజాత అని, కోహ్లీ జెర్సీపై సరోజ్ అనీ...ఇలా తల్లుల పేర్లు ఉండటం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్ని కలిగించింది. జీవితంలో పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేసిన మాతృమూర్తుల పేర్లు జెర్సీలపై ధరించడం అనేది తనకెంతో ఆనందం కలిగించిందని ధోని హర్షం వ్యక్తం చేశాడు కూడా. నిజానికి ఈ ఐడియా భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ఇండియాది. ‘నరుూ సోచ్’ పేరిట చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం కోట్లాది భారతీయుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడిదే కానె్సప్ట్‌ను కాస్త మార్చి, మహిళల క్రికెట్ జట్టూ చేపట్టాలనుకుంటోంది. కాకపోతే...తల్లుల బదులు తండ్రుల పేర్లు జెర్సీలపై ధరించాలన్నది వారి ఆలోచన.

తండ్రులూ తీసిపోలేదు

‘పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో తల్లులకు తండ్రులేం తీసిపోరు. తల్లుల త్యాగాలను స్మరించుకుంటున్నప్పుడు తండ్రులనెందుకు వదిలేయడం? వారి పేర్లను జెర్సీలపై ధరించడమన్నది గొప్ప ఆలోచన. నాకెలాంటి అభ్యంతరమూ లేదు’ అంటుంది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లార్. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి 20 సీరీస్‌కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇదే విషయమై హర్మన్‌ప్రీత్ తండ్రి హర్మందర్‌సింగ్ మాట్లాడుతూ పురుష క్రికెటర్లు తల్లుల పేర్లున్న జెర్సీలు ధరించినప్పుడు క్రీడాకారిణులు తండ్రుల పేర్లు రాయించుకున్న జెర్సీలు వేసుకోవడమన్నది సముచితమే. అయితే కేవలం తండ్రుల పేర్లే ఎందుకు? తండ్రీ తనయల పేర్లు కలిపి రాస్తే బాగుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత క్రికెట్ క్రీడాకారిణులు తమ పేర్లు (మొదటి పేరు గానీ, చివరి పేరు గాని) ఉన్న జెర్సీలు ధరిస్తున్నారు. ‘ఇది మంచి ఆలోచనే. ‘రాజ్’కు బదులు నా పేరు ‘దొరై రాజ్’ అనే పూర్తి పేరు రాస్తే బాగానే ఉంటుంది’ అని మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తండ్రి దొరైరాజ్ అభిప్రాయపడ్డారు.
ఈ ఆలోచనకు ఓపెనర్ స్మృతి మందన కూడా ఓటేసింది. ‘తండ్రుల పేర్లు ధరించేందుకు మాకు అనుమతినిస్తే బాగానే ఉంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మందన మాట్లాడుతూ తమ కుటుంబం పేరు ఇప్పటికే ఉందనీ, అయితే క్రీడాకారిణులంతా కోరుకుంటే తండ్రుల పేర్లు జెర్సీలపై రాయడంలో తప్పేం లేదని ఆయన అన్నారు.
నిజానికి జెర్సీలపై ఎవరి పేర్లు ఉండాలన్న విషయమై ప్రత్యేక నిబంధనలేవీ లేవు. కొంతమంది ఆటగాళ్లు తమ పేర్లు మాత్రమే ఉన్న జెర్సీలను ధరిస్తుంటే, ఇంకొందరు పొడి అక్షరాలను లేదా మొదటి పేర్లనూ మాత్రమే జెర్సీలపై రాయించుకుంటున్నారు.

హర్మన్‌ప్రీత్ కౌర్, ఆమె తల్లిదండ్రులు హర్మేందర్, సాత్విందర్ కౌర్