యువ

కుదిరితే... ఓ కప్పు టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుర్రకారుకు హుషారొచ్చిందనుకోండి..
పెద్దవారైనా మనసువిప్పి
మాట్లాడాలనుకోవాలనుకోండి..
చికాగ్గా ఉన్న మనసును దారికి
తెచ్చుకోవాలనుకోండి...
ఏం చేస్తాం... ఓ టీ తాగాలనుకుంటాం..
ఆస్ట్రేలియాలో 23 ఏళ్ల ‘వృద్ధి’ కూడా అలాగే అనుకుంది. ఓ మంచి సందర్భంలో అలా టీ తాగాలని నగరం అంతా తిరిగింది.
కానీ టీ దుకాణాలే కన్పించలేదు..
అంతే ఓ కొత్త ఆలోచన వచ్చింది.
ఆ టీని మనమే తయారు చేస్తే..
మనమే అందుబాటులోకి తెస్తే పోలా అనుకుంది...
టీ పెట్టడంలో ఘనాపాఠి లాంటి తాత చెంతకు చేరింది.
మెళకువలు నేర్చింది.
నాణ్యమైన టీ పొడి, కాసిన్ని ఆయుర్వేద మూలికలు, మరికాస్త ప్రేమ జోడించి.. కాచి వడపోసి రుచికరమైన టీ అందించడం మొదలెట్టింది. అక్కడితో ఆగలేదు... ఆన్‌లైన్‌లో టీ తయారు చేయడం ఎలాగో నేర్పుతోంది. తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో భారతీయులు, ఆసియా దేశాలకు చెందినవారు ఆమె పెట్టే చాయ్‌కోసం తహతహలాడుతున్నారు. ఆస్ట్రేలియన్లుకూడా టీ రుచికి అలవాటు పడి కాఫీ అభిరుచిని పక్కకునెట్టేస్తున్నారు. ఆమె ‘చాయ్‌వాలీ’గా ఎంతటి ప్రభావం చూపిందంటే...ఏకంగా ఓ అవార్డు కొట్టేసింది. ఇండియన్ ఆస్ట్రేలియన్ బిజినెస్ అండ్ కమ్యూనిటీ అవార్డు (ఐఎబిసిఎ)ల్లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఆమె ఎంపికైంది. ఇటీవలే అవార్డును ఆమెకు అందజేశారు. అయితే వృత్తిరీత్యా ఆమె లాయర్. ఓ సంస్థకు న్యాయసలహాదారుగా పనిచేస్తోంది. ఖాళీ సమయాల్లో ఈ టీ వ్యవహారం చూస్తోంది. మున్ముందు ఓ టీ రెస్టారెంట్‌ను, ఆస్ట్రేలియా అంతటా టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ‘్భరత్‌లో ఆనందాన్ని లేదా బాధను పంచుకునేటప్పుడు నలుగురూ కలసి టీ సేవిస్తారు. అందులో మజా ఆస్వాదిస్తారు. ఆ అనుభూతే వేరు. ఆస్ట్రేలియాలో కాఫీకి అంతే ఆదరణ ఉంది. అయితే ఇక్కడ ఉన్నవారికి టీ ఘుమఘుమలు పరిచయం చేశాక ఎంతో పేరు వచ్చింది. చాలామంది టీ అడుగుతున్నారు. ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో చాలాచోట్ల టీ దొరుకుతుంది’ అంటోంది వృద్ధి. ఆమె అసలు పేరు అప్మా వృద్ధి. కొత్త సంస్కృతితో కూడిన ప్రాంతంలో మన టీని పరిచయం చేసినప్పుడు ఇంత వృద్ధి సాధిస్తానని అనుకోలేదంటోంది ఆమె. భవిష్యత్‌లో పూర్తిస్థాయి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నట్లు చెబుతున్న వృద్ధి చాలామందికి స్ఫూర్తి.
కుదిరితే ఓ కప్పు టీ...
ఆమె నినాదం..బాగుంది కదూ!