యువ

నిద్రపుచ్చే స్లీప్ థెరపీ స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెడ్ ఎంత అద్భుతంగా ఉన్నా, చాలామందికి పడుకున్న వెంటనే నిద్ర రాదు. దానికి బెడ్‌ను నిందించి ప్రయోజనం లేదు. మైండ్ ప్రశాంతంగా ఉంటే, చెట్టుకింద పడుకున్నా హాయిగా నిద్ర పట్టేస్తుంది. ప్రముఖ ఐహోమ్ సంస్థ నిద్రలేమితో బాధపడేవారికోసం ఓ స్లీప్ థెరపీ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు ఐజడ్‌బిటి 10 స్పీకర్. ఇది లైట్ అండ్ సౌండ్ థెరపీతో పనిచేసే స్పీకరన్నమాట. నిద్రాభంగం కలిగించే బయటి ధ్వనులను నివారిస్తూ... మంద్రస్థాయిలో రికార్డు చేసిన ప్రత్యేకమైన ధ్వనులను వినిపిస్తూ ఇది నిద్రపుచ్చుతుంది. అలాగే ఓ పక్క మంద్రస్థాయిలో మ్యూజిక్ వినిపిస్తుంటే దానికి తగ్గట్టే డిమ్‌గా వెలిగే లైట్లు అదో రకం మత్తులో ముంచెత్తి, క్రమంగా మనకు నిద్ర పట్టేట్టు చేస్తాయట. ఈ స్పీకర్‌తోపాటు ఎఫ్‌ఎమ్ రేడియో, డ్యూయల్ అలారమ్స్, స్లీప్ టైమర్లు, ఓ యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్ వంటి సౌకర్యాలు అదనం. ఐజడ్‌బిటి 10 స్పీకర్ ధర 100 డాలర్లు.