యువ

సైకిల్‌తో కాలుష్యం కిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ (హెచ్‌బిసి) పేరు ఇప్పుడు అందరి నోళ్ళల్లోనూ నానుతోంది. దానికి కారణం-ఐక్యరాజ్య సమితి గుర్తింపే. ఈక్వడార్ రాజధాని క్విటోలో ఇటీవల జరిగిన యుఎన్ హాబిటట్-3 సదస్సు... అత్యుత్తమ సామాజిక పథకాలు చేపడుతున్న 20 సంస్థల్లో ఒకటిగా హెచ్‌బిసిని గుర్తించింది. ‘హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సరికొత్త అర్బన్ ఎజెండాను ముందుకు తీసుకువెడుతోంది. హైదరాబాద్‌లో చేపడుతున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి, చివరి స్టేషన్లకు ప్రజానీకాన్ని కనెక్ట్ చేసేందుకు వినూత్నమైన విధానాన్ని చేపడుతోంది’ అంటూ ప్రశంసించింది. ఒకప్పుడు 800 మంది మాత్రమే ఈ క్లబ్‌లో సభ్యులుగా ఉండేవారు. క్లబ్ చైర్మన్‌గా డివి మనోహర్ ఐదేళ్ల కిందట బాధ్యతలు స్వీకరించాక, సభ్యత్వాల సంఖ్యను 12వేలకు పెంచారు. సైక్లింగ్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఇందులో సభ్యులుగా చేరారు.
వాహన కాలుష్యం పెచ్చుమీరుతున్న జంటనగరాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు క్లబ్ తన వంతుగా కృషి చేస్తోంది. మెట్రోరైల్ తొలి స్టేషన్ అయిన నాగోల్‌వద్ద ఇటీవల హెచ్‌బిసి ఓ మోడల్ బైక్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 20 సైకిళ్లను ఉంచింది. మెట్రో రైల్ మార్గం మొదలయ్యేలోగా అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఇలాటి బైక్ స్టేషన్లను ఏర్పాటు చేసి, వాటిలో 10వేల సైకిళ్లు, ఇ బైక్స్‌ను ఉంచాలన్నది హెచ్‌బిసి లక్ష్యం. మెట్రో స్టేషన్లలో దిగిన జనం ఈ సైకిళ్లపై గమ్యస్థానాలకు వెడతారన్నమాట. ఐక్యరాజ్యసమితి హాబిటట్ -3 సదస్సును ఆకట్టుకున్న ఆలోచన ఇదే.అంతేకాదు...హెచ్‌బిసి ఆధ్వర్యంలో ఇప్పుడు నగరంలో బైక్ షేరింగ్ పద్ధతి కూడా నడుస్తోంది. హెచ్‌బిసి చేపట్టిన వినూత్న విధానాలను చూసి, ఎంతోమంది సైక్లిస్టులు క్లబ్‌లో సభ్యులుగా చేరారు. క్లబ్ చేపడుతున్న సరికొత్త విధానాలకు ఆకర్షితుడై సంగెం విజయభాస్కరరెడ్డి రెండేళ్ల కిందట సభ్యుడిగా చేరారు. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్‌పై యాత్ర చేసి వచ్చిన ఘనత ఆయనది. హైదరాబాద్ బైసైక్లింగ్ చేపడుతున్న విధానాల్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే, కాలుష్యం కొంతవరకైనా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చాలన్న లక్ష్యంతో తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రజల మద్దతు ఉంటే అది సాధ్యమేనని క్లబ్ చైర్మన్ మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు.