యువ

అమ్మాయలూ... మీరు అదుర్స్! ( చదువుకుంటూనే సంపాదన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పూట క్లాసులకు డుమ్మాకొట్టి
సినిమా చూస్తే మజాగానే ఉంటుంది.
మంచి దుస్తులు, మేకప్, పార్టీలు,
పార్కుల్లో విహారాలు..
ఇవన్నీ టీనేజ్ సందడిలో భాగమే.
అయితే అదొక్కటేనా.. ఏం చేయాలన్నా
పైసా కోసం పేరెంట్స్‌ను అడగాలి..
ఫీజుల బాదుడుకు తోడు ఇది కూడానా?
తల్లిదండ్రులకు భారం కాకుండా...
చదువు పాడవకుండా ఏదో ఒకటి చేయాలి.
చదువు పూర్తయ్యేవరకు ఖాళీగా ఎందుకు ఉండాలి?
క్లాసులు మిస్ కాకుండా
కాసులూ సంపాదించాలి.. అదీ సొంతంగా!
నచ్చిన పని... లేదా వ్యాపారం.. చేసేయాలి.
ఏం చేద్దాం... ఎప్పుడు చేద్దాం?
ఇదీ ఇప్పుడు యువతరాన్ని వేధిస్తున్న ప్రశ్న!

సరిగ్గా ఇలాగే ఆలోచించారు ఓ నలుగురు అమ్మాయిలు. అటు చదువు కొనసాగిస్తూనే ఖాళీ సమయం చూసుకుని లేదా ఖాళీ సమయం కల్పించుకుని పని మొదలెట్టేశారు. అభిరుచికి తగ్గ పనిని ఎంపిక చేసుకోవడంలో ఎవరిదారి వారిది.

హైదరాబాద్‌కు చెందిన అనూష రఘునాథ్, విక్రమ్ శ్రేయగౌడ్, భావన రాచపూడి స్నేహితులు. వారిది తొమ్మిదేళ్ల పరిచయం. అందరి ఆలోచనలూ ఒకటే.. చదువుతోపాటు కాస్తంత సంపాదించాలి. పనిలో అనుభవం సంపాదించాలి. అంతే. శ్రేయ, అనూష కలసి వ్యాపారం ప్రారంభించారు. భావన ఆలోచనలు వీరికి భిన్నం. బహుళజాతి సంస్థల్లో (ఎంఎన్‌సి) ఉద్యోగాల కోసం వెతుకులాడటం, ఆయా సంస్థల తీరుతెన్నులు పరిశీలించి సొంతంగా ఓ వెంచర్ మొదలెట్టడం ఆమె లక్ష్యం. మరో టీనేజ్ స్టూడెంట్ మమత అభిరుచి, ఆలోచనలు వేరు. భవిష్యత్‌లో సొంతంగా ఓ కంపెనీ పెట్టాలి. విజయం సాధించాలి. అందుకు ముందుగా అనుభవం కావాలి కదా! జనంతో కలసి పనిచేస్తే విషయాలు అర్థమవుతాయనుకుంది. సరే వీరంతా ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.

ఓ పుట్టిన రోజు వేడుక..
లేదా ఓ వివాహ వేడుక..
మరో శుభ సందర్భం..
మంచి గిఫ్ట్ ఇవ్వాలి...
చాలామంది బహుమతులు ఇస్తారు...
కానీ మనం ఇచ్చే కానుక అదిరిపోవాలి..
ఖరీదులో కాదు...
మన అభిరుచి, ఆలోచన, మన శుభాకాంక్షలు...
ఎదుటివారి మనసును తాకాలి..
అలాంటి బహుమతులు సొంతంగా తయారు చేసి విక్రయిస్తోంది శ్రేయ, ఆమె స్నేహితురాలితో కలసి!
హాండీక్రాఫ్ట్స్, మ్యాచ్‌బాక్స్ మెసేజెస్, బొమ్మలు..
గ్రీటింగ్ కార్డ్స్..ఎక్స్‌ప్లోజన్ బాక్స్‌లు ఇలా సరికొత్త ఆవిష్కరణలకు వారిద్దరూ శ్రీకారం చుట్టారు. ‘ఓ స్నేహితుడి కోసం ఓసారి సొంతంగా చేసిన ఓ గిఫ్ట్... ఈ ఆలోచనకు ప్రేరణ.. అతడు మరికొందరికి ఈ వినూత్నమైన బహుమతి గురించి చెప్పాడు. అలాఅలా చాలామందికి తెలిసింది. ఇప్పుడు మా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది’ అంటోంది శ్రేయ. 500 నుంచి 3,500 రూపాయల వరకు ధర పలికే ఆర్టికల్స్ తయారు చేస్తున్నామంటోంది అనూష. తమ అభిరుచికి తగ్గ బహుమతులు అందించాలన్న తపన ప్రజల్లో పెరుగుతోందని, అందుకోసం ఖర్చుకు వెరవడం లేదని, తమ వినియోగదారులంతా 17 నుంచి 30 ఏళ్లలోపు వారేనని చెబుతోంది. ఇద్దరం కలసి ఆలోచిస్తాం, ఆచరిస్తాం అంటున్న శ్రేయ, అనూష నెలకు 40వేల రూపాయలు సంపాదిస్తున్నారు.. అదీ సీజన్ బట్టి పెరుగుతూంటుందట. వీరికి తోటి విద్యార్థి భావనా రాచపూడి నుంచి గట్టి పోటీయే ఎదురవుతోంది. ఆమె వయస్సు 19 సంవత్సరాలు. ‘పాకెట్ మనీ కోసం ఎన్నాళ్లు పేరెంట్స్‌ను ఇబ్బంది పెడతాను. అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మే పని ప్రారంభించాను. మేం అందించే ప్రతి బహుమతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. రూ.999 నుంచి 6999 రూపాయల శ్రేణిలో ఆర్టికల్స్ విక్రయిస్తున్నా’ అంటోంది భావన. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చదువుతోంది. ‘ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటూంటా, ఒక్కోసారి రోజుకు పది గంటల కూడా కష్టపడాల్సి వస్తుంది, అయితే ఆ శ్రమలో ఆనందం కూడా ఉంటుంది’ అని చెబుతోందామె. పెళ్లిల్లు, వేడుకలు, పార్టీలు ఇలా ఏ సందర్భాన్నైనా ఉపయోగించుకోవాలన్నది లక్ష్యం, స్నేహితులతో కలసి సొంతంగా ‘ఈవెంట్స్’ నిర్వహించాలనుకునే మమత నెలకు 30 వేలు సంపాదిస్తోంది. ఒక్కోసారి స్టేజ్ షోలకూ సిద్ధపడుతోందట.

పాకెట్ మనీ కోసం పేరెంట్స్‌పై ఆధారపడకూడదన్న ఆలోచనతో
పార్ట్‌టైమ్ పని వెదుక్కున్న ఈ టీనేజీ అమ్మాయిలు..
అడపాదడపా అమ్మానాన్నలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు...ఆర్థికంగా!

chitram...

మమత, భావన, శ్రేయ