యువ

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆడిడాస్ బూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పోర్ట్ షూస్ తయారీలో అగ్రగామి సంస్థ ఆడిడాస్ తాజాగా ‘అల్ట్రా బూస్ట్ అన్‌కేజ్డ్ పార్లే’పేరిట కొత్తరకం బూట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడముచ్చటగా ఉన్న ఈ బూట్లను రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారంటే నమ్మలేం. న్యూయార్క్‌కు చెందిన ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి పర్యావరణ హితమైన ఈ బూట్లకు ఆడిడాస్ రూపకల్పన చేసింది. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఏటా 50వేల కోట్ల ప్లాస్టిక్ బ్యాగ్‌లు సముద్రంలో కలుస్తున్నట్టు ఓ అంచనా. వీటి బారిన పడి ఏటా లక్షకు పైగా సముద్ర జీవులు ప్రాణాలు వదుల్తున్నాయి. సముద్రంలో ఇలా వృథాగా కలుస్తున్న ప్లాస్టిక్‌పై పోరాటానికి ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థ నడుం బిగించింది.ఆడిడాస్ రూపొందించిన ‘అల్ట్రా బూస్ట్ అన్‌కేజ్డ్ పార్లే’కు డిమాండ్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏడువేల జతల బూట్లు తయారు చేసిన ఆడిడాస్, వచ్చే ఏడాది పది లక్షల బూట్లు తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో జతకు 220 డాలర్ల ధరను నిర్ణయించింది. 11 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తే, జత బూట్ల తయారవుతున్నాయి. ఇలా చూస్తే ఏడువేల జతల బూట్లకు 110 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లు అవసరమవుతాయన్నమాట. పర్యావరణ పరిరక్షణకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆడిడాస్‌ను అభినందించాల్సిందే. ఆడిడాస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రంగాల్లోని వ్యాపార సంస్థలూ నడుం బిగిస్తే, పర్యావరణం కొంతైన బాగుపడుతుంది కదూ!