యువ

సెల్ఫీలు తీసే డ్రోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోలో కనిపిస్తున్న వస్తువేంటో అంతుబట్టడం లేదా? అరచేతికి అరంగుళం ఎత్తున ఎగురుతున్న ఈ వస్తువు ఓ బుల్లి డ్రోన్! మరో విశేషమేంటంటే... అది సెల్ఫీలు తీస్తుంది. కేవలం సెల్ఫీలు తీసేందుకే రూపొందించిన ఈ మైక్రో డ్రోన్ పేరు-ఎయిర్ సెల్ఫీ! పేరుకు తగ్గట్టే ఇది గాలిలో ఎగురుతూ సెల్ఫీలు తీస్తుంది.
ఇప్పుడు యువతరాన్ని సెల్ఫీల క్రేజ్ ఊపేస్తోంది. అందుకు తగ్గట్టే సెల్ఫీ కెమెరాలతో ఉన్న స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. వీటితో సెల్ఫీలు తీసుకునేందుకు సెల్ఫీ స్టిక్స్‌లాంటి ఉపకరణాలూ వస్తున్నాయి. అయితే సెల్ఫీల కోసం ఏకంగా డ్రోన్‌నే తయారు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
ఎయిర్‌సెల్ఫీ బరువు 52 గ్రాములు మాత్రమే. ఇది స్మార్ట్ఫోన్‌కంటే చిన్నది. చక్కగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. ఐఫోన్ 6, 6ఎస్, 7, 7ఎస్, హువావీ పి9సహా అనేక ఆండ్రాయిడ్ ఫోన్లతో దీనిని ఆపరేట్ చేయొచ్చు. ఎయిర్ సెల్ఫీని సంబంధిత యాప్‌తో స్మార్ట్ఫోన్‌కు అనుసంధానించాలి.
యాప్ ద్వారానే ఎయిర్‌సెల్ఫీని ఆపరేట్ చేస్తారు. ఫొటోలో ఎయిర్ సెల్ఫీపై కనిపిస్తున్న చక్రాల్లాంటివి ప్రొపెల్లర్లు. యాప్ ద్వారా దీనిని ఆన్ చేయగానే ప్రొపెల్లర్లు చిన్నపాటి శబ్దం చేస్తూ తిరగడం మొదలెడతాయి. క్షణాల్లో ఎయిర్ సెల్ఫీ గాల్లోకి లేస్తుంది. ఇది 66 అడుగుల ఎత్తు పైవరకూ ఎగురుతుంది. యాప్ ద్వారా ఫోటోలు లేదా వీడియో తీసుకోవచ్చు. వెంటనే వాటిని స్మార్ట్ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా.
ఎయిర్ సెల్ఫీలో ఉండే శక్తిమంతమైన బ్యాటరీని స్మార్ట్ఫోన్ సాయంతోనే చార్జ్ చేసుకోవచ్చు. దీనిలో 5 మెగాపిక్సెల్ కెమెరా, హెచ్‌డి క్వాలిటీ వీడియో కెమెరా ఉంటాయి. ఎయిర్ సెల్ఫీని మార్కెట్ చేసేందుకు ప్రస్తుతం కిక్‌స్టార్టర్ క్యాంపయిన్ నడుస్తోంది. దీని ధర సుమారు 300 డాలర్లు.