యువ

మంచు స్థూపాలతో నీటి ఎద్దడి పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడేళ్ల కిందట వచ్చిన ‘3 ఇడియట్స్’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంప్రదాయ విద్యావ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తిచూపుతూ, పాఠ్యాంశాల బోధనలో ఎలాంటి మార్పులు చేయొచ్చో సాధికారికంగా చూపిస్తూ, వీలైనప్పుడల్లా సెటైర్లు పేలుస్తూ సాగిన ఈ సినిమా కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందులో హీరో అమీర్ ఖాన్ పోషించిన ‘్ఫన్‌షుక్ వాంగ్డూ’ పాత్ర అయితే మరీను! పిల్లలతో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయిస్తూ, వారి ప్రతిభకు సానబెట్టే పాత్రలో క్లైమాక్స్ సీన్లలో అమీర్‌ఖాన్ నటన చిన్నారులపై ఎంతో ప్రభావం చూపింది. అయితే ఈ పాత్రకు సంబంధించినంతవరకూ అమీర్‌పై ప్రభావం చూపిన మరో వ్యక్తి ఉన్నాడు. అతన్ని చూసే ‘్ఫన్‌షుక్ వాంగ్డూ’ పాత్రకు ‘3 ఇడియట్స్’ దర్శక నిర్మాతలు ప్రాణం పోశారట. అతని పేరు సోనమ్ వాంగ్‌చుక్.
లడఖ్‌కు చెందిన యాభయ్యేళ్ల సోనమ్ ఇటీవల మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. దానికి కారణం అతనికి ప్రతిష్ఠాత్మకమైన రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ దక్కడమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రయోగాలు చేసేవారికి ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది నలుగురికి లభించింది. వారిలో సోనమ్ ఒకడు. ఇటీవల ఈ అవార్డును సోనమ్ లాస్‌ఏంజెలిస్‌లో అందుకున్నాడు.
ఇంతకీ సోనమ్ ఏం చేశాడు?
ఉష్ణ ప్రాంతమైన లడఖ్‌లో అధికశాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే తీవ్రమైన నీటి కొరతతో వారు సాగుకు దూరమవుతున్నారు. ఇది సోనమ్‌ను కదిలించింది. తన స్వస్థలం కూడా అదే కావడంతో ప్రజలను నీటి ఎద్దడినుంచి బయటపడేసేందుకు అతనో వినూత్నమైన ఆలోచన చేశాడు.
అక్కడక్కడ మంచు స్థూపాలు నిర్మించాడు. ఒక్కొకటి 40 మీటర్ల ఎత్తున పర్వతాలను పోలిన ఈ మంచు స్థూపాలు శీతాకాలంలో నీటిని ఒడిసిపట్టుకుని, మంచుగా ఘనీభవిస్తాయి. ఒక్కొక్క మంచు స్థూపం 10 హెక్టార్ల భూమికి కావలసిన నీటిని అందజేస్తుంది. రెండేళ్ల కిందట సోనమ్ శ్రీకారం చుట్టిన ఈ వినూత్న ప్రక్రియ సక్సెస్ కావడంతో ఇప్పుడు లడక్‌లోని అనేక ప్రాంతాల్లో మంచు స్థూపాలు వెలుస్తున్నాయి. పైగా భూగర్భ నీటి మట్టమూ పెరుగుతోంది. ‘ఈ ఆలోచన మీకెలా వచ్చింది?’ అని సోనమ్‌ను అడిగితే, ఇదేం గొప్ప విషయం కాదంటాడు. ‘తొమ్మిదో తరగతి స్థాయి సైన్స్ ప్రక్రియే ఇది. పర్వత ప్రాంతాల్లో జీవనం గడిపే మాలాంటివారికి ప్రకృతితో మనుగడ సాగించేందుకు ఇలాంటి పద్ధతులు అవలంబించక తప్పదు’ అంటాడు సోనమ్.