యువ

ఉట్టిపడే సేవాభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవరచుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమాజసేవకు పాటుపడుతున్న యాలాల ప్రవీణ్‌కుమార్ ఇందుకు ఉదాహరణ. సెంట్రల్ వర్శిటీలో ఫిలాసఫీలో పీజీ చేస్తున్న ప్రవీణ్‌ను ఇటీవల ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) అవార్డు వరించింది. వారం రోజుల కిందట ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అతను అవార్డు అందుకున్నాడు. ఇదే విషయమై ప్రవీణ్‌ను కదిలిస్తే...యువతకు స్ఫూర్తిగొలిపే ఎన్నో అంశాల గురించి ప్రస్తావించాడు.
ఇరవై నాలుగేళ్ల ప్రవీణ్ ఇప్పటికే ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. అత్యవసర సమయాల్లో స్వయంగా రక్తదానం చేశాడు కూడా. హైదరాబాద్‌లో అతనొక్కడే రెండువేలకు పైగా మొక్కలు నాటాడు. ఎయిడ్స్, డెంగూ, మలేరియా వంటి వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనేకసార్లు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇంతగా సేవా కార్యకలాపాల్లో పాల్గొంటున్న మిమ్మల్ని కదిలించిన అంశమేదైనా ఉందా అని ప్రశ్నిస్తే రోడ్లపై చిన్నపిల్లలు ముష్టెత్తుకోవడం తనను చాలా బాధిస్తుందంటాడు ప్రవీణ్. ‘దీనంతటికీ మన విద్యావ్యవస్థే కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారాయి. ఉచిత విద్య గాల్లో కలిసిపోయింది. దీంతో పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు రోడ్లపై అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఓ సందర్భంలో నా అంతట నేను ముష్టి ఎత్తుకుంటున్న పదిమంది పిల్లలకు నచ్చజెప్పి, ఓ శరణాలయంలో చేర్పించాను. వాళ్లంతా కొన్ని రోజుల్లోనే శరణాలయంనుంచి తప్పించుకుని, మళ్లీ రోడ్లపై ముష్టివాళ్లుగా అవతారమెత్తారు. దీనికి కారణం వారు డబ్బుకు అలవాటు పడటమే’ అని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. యువతీయువకులు సమాజ సేవపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటాడతను. ‘పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ గురించే కాదు, సమాజం గురించి కూడా ఆలోంచించినప్పుడే దేశం బాగుపడుతుంద’న్నది ప్రవీణ్ అభిప్రాయం.

జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) 1969లో ఏర్పాటైంది. విద్యార్థుల్ని సమాజ సేవవైపునకు మళ్లించడం దీని లక్ష్యం. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎస్‌లో లక్షలాది విద్యార్థులు వలంటీర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ఎన్‌ఎస్‌ఎస్ అవార్డుకు తెలంగాణనుంచి ఎంపికైన ఇద్దరిలో ప్రవీణ్ ఒకడు కావడం గమనార్హం. ఇలా దేశవ్యాప్తంగా ఎంపికైన 30మందితో ప్రవీణ్ పోటీ పడి, అవార్డు సాధించాడు.