యువ

రోబో రోడ్డెక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీ ఇంటికొచ్చా...మీ నట్టింటికొచ్చా’ అంటూ ఓ హీరో పలికిన డైలాగ్ ఆ మధ్య బాగా పాపులర్ అయింది. అవే మాటలు ఓ రోబో పలికితే ఎలా ఉంటుంది!
ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! లండన్‌కు చెందిన సైమన్ అనే మహిళ కూడా ఇలాగే బోలెడంత ఆశ్చర్యపోయింది. దానికి కారణం.. ఓ రోబో స్వయంగా వచ్చి, ఆమె ఇంటి తలుపు తట్టి ఆమె ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సర్వ్ చేసి, బై చెప్పి వెళ్లిపోవడం!
అసలు విషయంలోకి వస్తే...‘జస్ట్ ఈట్’ అనే టేక్ ఎవే ఫుడ్ సంస్థ స్టార్‌షిప్ టెక్నాలజీస్ అనే సంస్థతో కలసి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ఏవిటంటే...తాము తయారు చేసే ఫుడ్‌ను రోబోలతో కస్టమర్ల ఇంటికి చేర్చడం. స్టార్‌షిప్ టెక్నాలజీస్ సంస్థ మొబైల్ రోబోల తయారీలో పేరెన్నిక గన్నది. ఫుడ్ సరఫరా కోసం ఆరు చక్రాల ఓ రోబోలను అప్పటికే తయారు చేసింది. వీటిని లండన్ వీధుల్లో ఐదు నెలలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసింది. చివరకు వాటిని రంగంలోకి దింపే రోజు రానే వచ్చింది. ఆ రోజు నవంబర్ 28. లండన్‌కు ఆగ్నేయంగా ఉన్న గ్రీన్‌విచ్ అనే ప్రాంతంలో ఉన్న ఓ టర్కిష్ రెస్టారెంట్‌కు సైమన్ అనే మహిళ ఫోన్ చేసింది. ఆమె జస్ట్ ఈట్ మొబైల్ యాప్ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. వెంటనే స్టార్‌షిప్ టెక్నాలజీస్‌నుంచి ఓ రోబో ఆ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడున్న ఓ వెయిటర్...సైమన్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ను ఆ రోబోలో సర్దింది. అంతే.. రోబో రోడ్డెక్కింది. ఆ విషయం సైమన్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా అందింది. రోబోనెమ్మదిగా బయల్దేరి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది. వెంటనే ‘మీ ఫుడ్ మీ ఇంటిముందు సిద్ధంగా ఉంది’ అంటూ సైమన్‌కు మరో మెసేజ్ అందింది. సైమన్ తలుపు తీసి చూస్తే...ఓ బుల్లి రోబో ఇంటిముందు వెయిట్ చేస్తోంది. సైమన్ ఆశ్చర్యంలోంచి తేరుకుని, రోబోలో ఉన్న ఫుడ్‌ను తీసుకుంది. ఆ వెంటనే రోబో వెనుదిరిగింది. రోబో వెళ్లిపోయినా...సైమన్ అది వెళ్లిన దిశగా అలా ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోయిందట. ‘ఇదంతా ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. ఇలాంటి టెక్నాలజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అంటూ సంబరపడిపోయింది.

చిత్రం..రోడ్డు మీద రోబో నడక