యువ

మోనికా... ఓ మోనికా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబ్ డ్రైవర్‌గా ఈ మధ్యే పనిచేయడం మొదలుపెట్టినా, తన జీవితంలో మరపురాని సంఘటనలు ఎన్నో జరిగాయని చెబుతోంది మోనికా. ప్రయాణికులనుంచి రోజుకో కొత్తపాఠం నేర్చుకుంటానని చెప్పే మోనికా, కొన్ని సంఘటనల గురించి చెప్పింది.
ఓసారి గాంధీనగర్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక ఓ అమ్మాయిని ఎక్కించుకుని వెడుతోందట. దారిలో ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంది. ఇద్దరూ కలసి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. ఆ రెండు గంటల్లో ఇద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. ఇప్పటికీ వారిద్దరి మధ్యా స్నేహం కొనసాగుతోంది.
మరో సందర్భంలో ఓ పెద్దాయనను తీసుకుని వెడుతోంది. ఆయనో పెద్ద బిజినెస్ మాగ్నట్. కిచెన్ మాడ్యూల్ షాప్ ఉందని తెలిసింది. ఆర్కిటెక్చర్ చదివి, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మోనికా గురించి తెలుసుకుని చాలా సంతోషించారట. ఇంటికి చేరుకున్నాక, మోనికాను ఇంట్లోకి పిలిచి, కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశారట. ఇంటీరియర్ డిజైనింగ్‌లో శిక్షణ ఇస్తానని స్వయంగా ఆఫర్ ఇచ్చారట.
**
ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్‌గానే పనిచేయాలా?
ఆర్కిటెక్చర్ చదివితే ఆర్కిటెక్ట్‌గానే పనిచేయాలా?
ఏం అక్కర్లేదంటోంది మోనికా యాదవ్.
ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేసి, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (అహ్మదాబాద్)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మోనికా ఓ క్యాబ్ డ్రైవర్ అంటే నమ్మలేరేమో...కానీ నిజం.
అలాగని, మోనికా డబ్బుకోసం తప్పనిసరై ఈ పని చేస్తోందనుకునేరు. మధ్యతరగతికి చెందిన మోనికాకు అన్ని సమస్యలేం లేవు. కాకపోతే, డ్రైవింగ్ అంటే ఆమెకు మహా ఇష్టం. తనకు అందులో అమితానందం లభిస్తోందనీ, డ్రైవర్‌గా పనిచేయడం నామోషీగా భావించడం లేనీ అంటోందామె.
జైపూర్‌లో డిగ్రీ చదివిన మోనికా, అహ్మదాబాద్‌లో పిజీ చేసేందుకు వచ్చింది. ఐదేళ్లపాటు అలుపెరగకుండా చదివి, నెలల తరబడి అసైన్‌మెంట్స్ కోసం పనిచేసీ, చేసీ అలసిపోయిన మోనికా పీజీలో చేరాక, ఆలోచనలో పడింది. పదింటికి వెళ్లి, ఐదింటిదాకా ఆఫీసులో పనిచేసే ఉద్యోగం పట్ల ఎందుకో ఆమెకు ఇష్టం లేకపోయింది. మరేం చేయడం? వెంటనే ఆమెకు గుర్తుకొచ్చిన అంశం-డ్రైవింగ్! కారు నడపటమంటే మోనికాకు ఎంతో ఇష్టం. ఆ మాటకొస్తే, డిగ్రీ చదువుతున్నప్పుడు తీరిక దొరికినప్పుడల్లా కారేసుకుని ఇండియా అంతా కలియదిరిగేసిందామె. అది గుర్తుకొచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచించింది. ఫ్రెండ్స్‌ను సలహా అడిగితే అదోలా చూశారు. నిరుత్సాహ పరిచారు. ఏదైతే అదవుతుందని, ఓ రోజు తిన్నగా ఓలా కాబ్స్ ఆఫీస్‌కు వెళ్లి, జాబ్ కావాలని అడిగేసింది. వాళ్లు కంగారు పడ్డారు. వయసులో ఉన్న అమ్మాయిని కారు డ్రైవర్‌గా అపాయింట్ చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దాంతో మోనికా పట్టు వదలని విక్రమార్కుడిలా ఉబెర్ కాబ్స్‌ను సంప్రదించింది. వాళ్లు ఎగిరి గంతేసి, ఉద్యోగం ఇచ్చేశారు. ఇంకేముంది? మోనికా ఉబెర్ కాబ్స్ డ్రైవర్‌గా అవతారమెత్తింది.
రోజూ ఉదయం ఐదింటినుంచి ఎనిమిదిన్నర వరకూ కాబ్ నడపటం. తర్వాత కాలేజ్‌కి వెళ్లడం. ఐదింటికి కాలేజ్ కాగానే మళ్లీ రాత్రి పదింటి వరకూ డ్రైవింగ్. ఇదీ మోనికా దినచర్య.
ఈ ఉద్యోగం తనకెంతో సంతృప్తినిస్తోందని మోనికా చెబుతోంది. ‘మనసు ఏం చెబితే అదే వినాలి. ఎవరో ఏదో అన్నారని మన ఇష్టాల్ని మార్చుకోకూడదు. నేనదే పనిచేసి ఉంటే ఈ వృత్తిలో నాకింత సంతృప్తి దొరికేదే కాదు’ అంటోంది మోనికా. అన్నట్టు...గుజరాత్‌లో మొట్టమొదటి మహిళా కాబ్ డ్రైవర్ మోనికాయే!