యువ

మీ పేరు మీద ఓ మొక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏటా డిసెంబర్ 2న ఐఎస్‌బి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ఏడాది హైదరాబాద్, మొహాలీల్లోని ఐఎస్‌బి ఆవరణల్లో 60మంది మొక్కలు నాటారు’ అని వివరించారు ఐఎస్‌బి అసోసియేట్ డైరెక్టర్ వర్షా రత్నాపర్కె.
**
ఓ మంచి పని చేయడానికి ఎంచుకునే మార్గమేదైతేనేం? హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ఇలాంటి ఆలోచనకే ఆచరణరూపమిచ్చింది. ఇప్పుడు ఆ ఆలోచన పదిమందికీ అనుసరణీయమైంది.
ఐఎస్‌బిలో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ఎవరైనా ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేస్తే, ఆవరణలో ఓ మొక్క నాటాలి. మొక్కతోపాటు తమ పేరును, హోదాను తెలియజేసే బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు. మంచి కానె్సప్ట్ కదా! ఇలా ఇప్పటివరకూ ఐఎస్‌బి క్యాంపస్‌లో 200 మొక్కల వరకూ నాటారు. వాటిని ఎవరెవరు నాటారో కూడా అక్కడ ఉండే బోర్డుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు...సర్వీస్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతున్నవారంతా ఇక్కడ మొక్కలు నాటుతున్నారు.
‘ఏటా డిసెంబర్ 2న ఐఎస్‌బి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ఏడాది హైదరాబాద్, మొహాలీల్లోని ఐఎస్‌బి ఆవరణల్లో 60మంది మొక్కలు నాటారు’ అని వివరించారు ఐఎస్‌బి అసోసియేట్ డైరెక్టర్ వర్షా రత్నాపర్కె. ఉద్యోగులు కాకుండా ఐఎస్‌బిని సందర్శించే ప్రముఖులు కూడా ఇక్కడ విధిగా ఓ మొక్క నాటడం రివాజుగా వస్తోంది. అప్పటి రాష్టప్రతి ప్రతిభా పాటిల్, ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సహా ఎందరో ప్రముఖులు ఇలా మొక్కలు నాటి, పర్యావరణానికి తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు.
ఇంతకీ ఈ ఐడియా ఎవరిది? ‘ఓసారి అందరూ కూర్చుని ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు గుర్తుండిపోయేలా ఏదైనా చేస్తే బాగుండునని చర్చించుకుంటుంటే ఈ ఐడియా తోచింది. వెంటనే ఆచరణలోకి తెచ్చాం’ అన్నారు వర్ష.
మొన్న డిసెంబర్ 2న మొక్కలు నాటిన వారిలో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన శిరీష పంద్రవాడ కూడా ఉన్నారు. ఇలా మొక్క నాటడంపై ఆమె చాలా థ్రిల్ ఫీలయ్యారు. ‘నేను ఇక్కడ ఉండొచ్చు. లేదా మరెక్కడైనా పని చేయొచ్చు. కొనే్నళ్లు గడిచాక ఈ మొక్క పెరిగి పెద్దదవుతుంది. ఈ చెట్టు ఎనే్నళ్లు ఉంటే అనే్నళ్లూ నా పేరు కూడా ఉంటుంది. అది తలచుకుంటేనే ఎంతో థ్రిల్‌గా ఉంది’ అన్నారామె.