యువ

యాంఫీబియస్ ఎయిర్‌క్రాఫ్ట్.. గాల్లోనూ, నీళ్లమీదా పరుగెట్టే విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేమ్స్‌బాండ్ బుల్లి హెలికాప్టర్‌లో పారిపోతుంటే, విలన్ ఛేజ్ చేస్తూంటాడు. ఇంతలో అనుకోని అవాంతరం. ఎదురుగా విలన్ గ్యాంగ్ జెట్ ఫైటర్స్‌లో బాండ్ కాప్టర్‌ను ఢీకొట్టేందుకు వస్తూంటారు. జేమ్స్‌బాండ్‌కు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోదు. ఆ వెంటనే తేరుకుని, ఓ బటన్ నొక్కుతాడు. అంతే...అప్పటికప్పుడు హెలికాప్టర్ సర్రున కింద ఉన్న సముద్రం వైపు దూసుకుపోతుంది. నీళ్ల మీదకి వచ్చేసరికి చక్రాలు లోపలకి వెళ్లిపోతాయి. రెక్కలు లోపలికి ముడుచుకుపోతాయి. అంతే... నీళ్ల మీద హెలికాప్టర్ రయ్యిన దూసుకుపోతుంది. పైనుంచి విలన్ అండ్ కో తెల్లమొహం వేసుకుని చూస్తూంటారు. ఇప్పటివరకూ సినిమాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు నిజం కాబోతోంది. అమెరికాకు చెందిన ఐకాన్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఐకాన్ ఏ5 అనే బుల్లి విమానాన్ని సృష్టించింది. ఇందులోరెండే సీట్లుంటాయి. గాల్లోనూ, నీళ్లపైనా నడిచే సరికొత్త టెక్నాలజీతో రూపొందిన ప్రత్యేక విమానమిది. రెక్కల్ని ఫోల్డ్ చేసే వీలుండటం ఆకాన్ ఏ5లో ప్రత్యేకత.