యువ

గ్రీన్ ఆటోస్ జిందాబాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది మరో స్నేహితుల జంట కథ. చదువుకున్నాం..ఉద్యోగాలు సంపాదించుకుని స్ధిరపడిపోదాం అనుకోకుండా తాము చదివిన చదువు పర్యావరణ హితానికి ఉపయోగపడితే మేలని భావించారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. భరత్ మామిడోజు, పారుపాటి మధుకర్‌రెడ్డి- హైదరాబాద్‌కు చెందిన కుర్రాళ్లు. భరత్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌నుంచి డిగ్రీ తీసుకున్నాడు. ‘గ్రీన్ థంబ్స్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థనూ నడుపుతున్నాడు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు తన వంతు కృషి చేయాలన్న తపన అతనిది. అలాంటి ఆలోచనలే ఉన్న మధుకర్...్భరత్‌కు తోడయ్యాడు. ఇద్దరూ కలసి ‘అడాప్ట్ మోటార్స్’ పేరిట ఓ ఆటోల తయారీ సంస్థను ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో వాహన కాలుష్యం గురించి తెలిసిందే. అందులో ఆటోలు వెదజల్లే కాలుష్యాన్ని తీసిపారేయలేం. కాబట్టి ఇ-రిక్షాలు తయారు చేయడం మంచిదని నిర్ణయించుకుని ఆ దిశగా కృషి చేయడం మొదలుపెట్టారు. పెద్ద అంబర్‌పేటలో తమ సంస్థను ఏర్పాటు చేసి, ఇ-ఆటోల తయారీకి శ్రీకారం చుట్టారు. స్వీకార్, స్వీకార్-ఎల్ పేరిట రెండు రకాల ఆటోలను ఉత్పత్తి చేస్తున్నారు. భరత్, మధుకర్‌ల కృషికి మంచి గుర్తింపే దొరికింది. చెన్నై, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్‌లనుంచి ఆటో డీలర్లు ఆర్డర్లు ఇస్తున్నారట. అలాగే ప్రైవేట్ వ్యక్తులూ వీటిని బాగానే కొంటున్నారంటాడు భరత్.
ఇ-ఆటో ధర లక్షా పదివేలు. బ్యాటరీతో నడిచే ఇ- ఆటో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెడుతుంది. చార్జింగ్ అయిపోతే నడిరోడ్డుమీద ఆగిపోతుందనే బెంగ అక్కర్లేదు. ఆటోకు అమర్చిన పెడల్స్‌ను కాసేపు తొక్కితే విద్యుదుత్పత్తి జరిగి, బ్యాటరీ పనిచేస్తుంది. మామూలు ఆటోల్లాగే ఇందులో డ్రైవర్ కాకుండా ముగ్గురు ప్రయాణించే సదుపాయం ఉంది.

చిత్రం..భరత్, మధుకర్‌రెడ్డి