యువ

బాబోయ్.. డ్రోన్‌గన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లో రకరకాల డ్రోన్లు దొరుకుతున్నాయి. చివరకు పెళ్లిళ్లు జరిగినా, సభలు నిర్వహించినా కవరేజ్‌కి డ్రోన్లనే వాడుతున్నారు. గాలిలో ఎగురుతూ సమాచారాన్ని సేకరించే డ్రోన్లు, అలా సేకరించిన సమాచారాన్ని వీడియోల రూపంలో కిందకు చేరవేస్తాయి కూడా. జాతి వ్యతిరేక శక్తులు లేదా ఉగ్రవాదులు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఎంత ప్రమాదమో ఊహించడం కష్టమే. ఇలాంటి డ్రోన్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు ‘డ్రోన్ గన్’ తయారైంది. అమెరికాలోని డ్రోన్ షీల్డ్ అనే సంస్థ తయారు చేసిన ఈ ఆయుధం నిజంగానే పెద్ద గన్‌ను తలపిస్తోంది. అయితే ఇది డ్రోన్‌ను కూల్చేస్తుందనుకుంటే పొరబడినట్టే. అనుమానం వచ్చినప్పుడు ఈ డ్రోన్‌గన్‌ను ఉపయోగిస్తే, డ్రోన్‌కు సిగ్నల్స్ అందకుండా అడ్డుకుంటుంది. అంటే అది సమాచారాన్ని సేకరించడం లేదా చేరవేయడం గానీ చేయలేదన్నమాట. సిగ్నల్స్ అందని పక్షంలో డ్రోన్లు సురక్షితంగా నేలకు దిగిపోతాయి. కాబట్టి వాటిని సీజ్ చేసి, పరీక్షించవచ్చు కూడా. డ్రోన్‌గన్లకు ఇంకా అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదట. ఒకవేళ అనుమతి వస్తే, వాటిని ప్రభుత్వానికే విక్రయించాల్సి ఉంటుంది.