యువ

పాటలతో సయ్యాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి శేఖర్ కపూర్ పెద్ద డైరెక్టర్. బండిట్ క్వీన్, మాసూమ్ వంటి సినిమాలు చూస్తే అతని సత్తా ఏంటో తెలుస్తుంది.
తల్లి సుచిత్రా కృష్ణమూర్తి సింగర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ కంపోజర్. ఆమె గురించి తెలీని వాళ్లకి షారుఖ్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘కభీ హా కభీ నా’ సినిమా చూస్తే చాలు.
తల్లిదండ్రులిద్దరూ బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలవాళ్లయినప్పుడు ఆ జీన్స్ బిడ్డకూ వస్తాయిగా!
కావేరీ కపూర్ పేరు చెబితే ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఆమె వయసు ఇప్పటికింకా పదహారేళ్లే. ఆమె శేఖర్ కపూర్, సుచిత్రా కపూర్‌ల కుమార్తె. ముక్కు పచ్చలారని ఈ చిన్నారి సంగీతంలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రెండు ఆల్బమ్‌లు విడుదల చేసిన కావేరి, ఆరో ఏటనే సంగీత సాధన ప్రారంభించి, ఓ స్థాయికి ఎదిగింది. మరోవైపు పాటల రచయితగానూ ఎదుగుతోంది. తన పేరులోని చివరన ఉన్న ‘కపూర్’ కంటే కావేరిగానే గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెప్పే ఈ చిన్నది... తండ్రిలోని రచనాశక్తిని, తల్లిలోని సంగీత జ్ఞానాన్ని అందిపుచ్చుకుని, తనదైన బాటలో ఎదగాలని తాపత్రయపడుతోంది.
కావేరి ఇప్పటికే పాడిన ‘డిడ్ యు నో’, ‘హాఫ్ ఎ హార్ట్’ పాటలు సూపర్‌హిట్. తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలే అయినా, తనను మాత్రం ఓ సెలబ్రిటీల బిడ్డగా పెంచలేదనీ, అందుకే తాను స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని అంటుంది కావేరి. మరి నటించాలని లేదా అనడిగితే, నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేసింది. పాడటం, రాయడం...ఈ రెండు రంగాలే తనకు ఎంతో ఇష్టమని, వాటిలోనే తన కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటానని చెబుతున్న కావేరి, త్వరలో మరో ఆల్బమ్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నానని, దాని తర్వాత కెరీర్‌పై సీరియస్‌గా ఆలోచిస్తానని చెబుతోంది.