యువ

కదిలింది ‘కరుణ’ రథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరుణ నాయర్!
డిసెంబర్ 19కు ముందు వరకూ ఈ పేరు చాలామందికి తెలియదు.
డిసెంబర్ 19 తర్వాత ఈ పేరు తెలియని వారెవరూ లేరు.
ఆ ఒక్కరోజులో ఏం జరిగింది?
అంతలా అతని పేరు ఎందుకు మార్మోగిపోయింది?
ఆ రోజు...చెన్నై చిదంబరం స్టేడియంలో పరుగుల వరద పారింది.
సెంచరీల మోత మోగింది.
ఒకటి కాదు...రెండు కాదు...మూడు..
ట్రిపుల్ సెంచరీ!
ఆ ఘనత సాధించింది కరుణ నాయర్!
ఆడిన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు!
సెవాగ్ తర్వాత టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అదీ విశేషం!
కరుణ నాయర్ జీవితంలో అతనిపై ప్రభావం చూపిన కొన్ని ముఖ్య సంఘటనలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
చచ్చి బతికాడు!
ఇదే ఏడాది జూలైలో ఓ రోజు నాయర్ కేరళలోని పంపా నది ఒడ్డున ఉన్న ఓ ఆలయానికి బయల్దేరాడు. దారిలో అతను ప్రయాణిస్తున్న పడవ తలకిందులైంది. అతనితోపాటు అదే బోటులో ఉన్న ఆరుగురు నీళ్లలో మునిగి చనిపోయారు. ఈత అంతంతమాత్రంగానే వచ్చిన కరుణ...ఈదలేక అలసిపోయి, నీళ్లలో అలా తేలియాడుతూ కొన్ని గంటలు గడిపాడు. చివరకు రెస్క్యూ టీమ్ వచ్చి రక్షించేంతవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాడు.
సచినే ప్రేరణ
ఈ తరం క్రికెటర్లకు సచిన్ టెండూల్కరే ప్రేరణ. నాయర్‌కు కూడా అందుకు మినహాయింపు లేదు. సచిన్‌ను చూసి, తానూ అలానే పెద్ద క్రికెటర్ కావాలనే అభిలాషతో బ్యాట్ చేతపట్టుకున్నాడు. సచిన్ కాకుండా మీ అభిమాన క్రికెటర్లు ఇంకెవరని అడిగితే, అతని నోట వచ్చే మరో పేరు- రాహుల్ ద్రావిడ్.
గురువు ద్రావిడ్
నాయర్‌కు క్రికెట్‌లో ఓనమాలు నేర్పింది రాహుల్ ద్రావిడే. చివరకు నాయర్ భారత జట్టులో స్థానం సంపాదించినప్పుడు ఆ శుభవార్త అతని చెవిన వేసిందీ ద్రావిడే. అప్పుడు ద్రావిడ్ ఇచ్చిన సలహా తాను జీవితాంతం మరచిపోలేనంటాడు నాయర్. ఇంతకీ ఆ సలహా ఏవిటంటే ‘అంతర్జాతీయ క్రికెట్‌లో నీ శకం మొదలైంది. నువ్వు నీలానే ఆడు. ఎవరినీ చూసి నీ ఆటతీరును మార్చుకోకు’ అని. ఈ సలహాను జీవితాంతం గుర్తుంచుకుంటానంటాడు నాయర్.
రంజీల్లోనూ తడాఖా
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ నాయర్, అంతకుముందు రంజీల్లోనూ అదే ఘనత సాధించాడు. రంజీ టోర్నమెంట్‌లో 68 ఏళ్ల తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత అతనిదే.