యువ

చిత్రం...్భళారే విచిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మననుంచి వీడ్కోలు తీసుకుని వెళ్లిపోతోంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కొన్ని తీపిగుర్తుల్ని, మరికొన్ని చేదు గుళికల్ని మిగిల్చిపోతోంది. అయితే ఈ ఏడాది కొన్ని చిత్రవిచిత్రమైన సంఘటనలకు వేదికైంది. మరి కొన్ని గంటల్లో 2016 నిష్క్రమిస్తున్న వేళ...వాటిని ఓసారి నెమరేసుకుందాం.

అమ్మకానికి పెళ్లాం
ఇల్లూ, వాకిలినే కాదు...పెళ్లాలను అమ్మకానికి పెట్టే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి అలాంటిపనే చేసి ఇరుక్కుపోయాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల దిలీప్ మాలికి అప్పులు పెరిగిపోయి, ఏం చేయాలో తోచలేదు. అప్పులవాళ్లు ఇంటిమీదకొచ్చే సరికి ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేస్తూ తన భార్యను లక్ష రూపాయలకు అమ్మకాని పెట్టాడు. అంతటితో ఊరుకోకుండా ఆమె ఫోటోను కూడా పోస్ట్ చేసేశాడు. పైగా ‘ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు’నంటూ తన మొబైల్ నంబర్‌ను కూడా ఇచ్చాడు. దాంతో అతని భార్య లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులొచ్చి, దిలీప్‌ను అరెస్ట్ చేశారు.