యువ

హీరోలకు హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యే విడుదలై సంచలనం సృష్టించిన ‘దంగల్’ సినిమా చూశారా! అందులో ‘మల్లయుద్ధం’ నేర్పే శిక్షకుడి పాత్రలో అమీర్‌ఖాన్ శరీరసౌష్టవం కన్నార్పకుండా చేసింది కదూ!
తెలుగు సినీసీమలో ఈ మధ్యే మెరిసిన ‘్ధృవ’ చిత్రంలో రామ్‌చరణ్ నాజూకుగానే అయినా సిక్స్‌ప్యాక్ తరహాలో కనిపించి మెరిసిపోయాడు గుర్తుందా!..
ఆమధ్య ‘సుల్తాన్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ కండలు తిరిగిన శరీరంతో యువతరాన్ని కట్టిపడేశాడు కదా!...
ఈ స్టార్ హీరోలంతా ఇలా ఎలా తయారయ్యారు..
వయసుపెరిగిన పెద్ద హీరోలు..
మాంచి ఊపుమీద ఉన్న కుర్ర హీరోలూ..
సినీతారలు, మోడల్స్ ఇలా అందమైన మేనితో, రూపుతో మెరిసిపోవడానికి కారణం.. ఒకేఒక్కడు.
అతడి పేరు రాకేష్ ఉడియర్..
ఫిజికల్ ఫిట్నెస్ ట్రెయినర్...
అమీర్‌ఖాన్ అయినా,
సల్మాన్‌ఖాన్ అయినా,
రామ్‌చరణ్ అయినా అతడితోనే శిక్షణ తీసుకుంటారు...
దియామీర్జా అయినా...
డెయిసీ షా అయినా..
కునాల్ కపూర్ అయినా..అంతే
పుల్‌కిత్ సమ్రాట్ సరేసరి..
ఎందుకంటే ఫలితం రాబట్టంలో రాకేశ్ రాక్షసుడే మరి.
ఆ పని రాక్షసుడంటే ఈ తారలకు ఇష్టం..
తక్కువ సమయంలో బరువు పెరగడం, అంతే తక్కువ సమయంలో మళ్లీ సాధారణ బరువుకు తగ్గడం, కండలు తిరిగిన శరీరంతో కనిపించడం, అదే శరీరాన్ని నాజూకుగా మార్చేయడం వంటివన్నీ అతడికి తెలిసిన విద్యలో విశేషాలు. అందుకే వివిధ రంగాల్లో సెలబ్రిటీలకు అతడు ట్రెయినర్...అందుకే అతడిని అందరూ స్టార్‌ట్రెయినర్ అంటారు.. సరే ఇప్పుడంటే రాకేష్ స్టార్ అయ్యాడు కానీ...ఆ స్థితికి రావడానికి అతడు ఓ పోరాటమే చేశాడు. ఒక్కపూటే తిన్న రోజులున్నాయి. పస్తులున్న రోజులున్నాయి...మురికివాడలో తిరగాడిన గతం ఉంది. ఇవేవీ మరచిపోని రాకేష్ ఒద్దికగానే ఉంటాడు. చిన్నప్పటినుంచి ఒకటే కల. మంచి ఆరోగ్యం, చక్కటి శరీరం, మంచి ఫిట్‌నెస్ ఉండాలన్నది అతడి కోరిక. పేపర్‌లోనైనా, పుస్తకాలలోనైనా, సినిమాల్లోనైనా...ఎక్కడ ఆ ప్రస్తావన వచ్చినా, కథనాలు వచ్చినా చదవాల్సిందే. ఏ ఆహారం ఎంత తీసుకోవాలో, ఏ మేరకు శరీరానికి శ్రమ కలిగించాలో తెలుసుకోవడమే పని. అదే ధ్యాస. అదే శ్వాస. ఇప్పటికీ అదే పని. అందుకే అతడు స్టార్‌లకు స్టార్ అయ్యాడు.
చిన్నతనం అంతా ముంబైలోని బాంద్రాలో గడిచేది. తండ్రి కాంట్రాక్టర్. రాకేష్‌కు ఆరేళ్ల వయస్సున్నప్పుడు తండ్రికి పక్షవాతం వచ్చింది. కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. రోజూ చిన్నచిన్న వస్తువులు బస్సుల్లోను, రైళ్లలోను తిరుగుతూ అమ్మడమే వ్యాపకం. రోజుకు పాతిక గడిస్తే గొప్పే. ఆ తరువాత ఓ దాబాలో పనికి చేరాడు. అతడి అన్నయ్య ఓ టీస్టాల్‌లో చేరాడు. కాస్తంత ఆదాయం పెరిగింది. ఓ పూట తిండి గ్యారంటీ. తల్లి ఓ సంపన్న కుటుంబంలో పనిమనిషిగా చేరింది. ముఖ్యంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచడమే ఆమె బాధ్యత. రాకేష్‌ను, అతడి అన్నను చదివించే బాధ్యత ఆ కుటుంబం తీసుకుంది. అదే వారికి కాస్తంత ఉపశమనం కలిగించిన అంశం. పదహారేళ్ల వయసు వచ్చాక ముంబైలో పేరుమోసిన ‘క్యూ’ జిమ్‌లో స్వీపర్‌గా చేరాడు. అక్కడ అందరూ చేసే పనులు, శిక్షణ దగ్గరనుంచి గమనించడం మొదలెట్టాడు. కొంతకాలం గడిచాక అదే జిమ్‌లో ఫ్లోర్ ట్రెయినర్‌గా ప్రమోషన్ వచ్చింది. కొద్దికాలం తరువాత ‘గోల్డ్’ జిమ్‌కు మారాడు. అక్కడకు వచ్చే సెలబ్రిటీలతో పరిచయాలు పెరిగాయి. అర్బాజ్‌ఖాన్‌కు ఫిట్‌నెస్ ట్రెయినింగ్ ఇస్తున్నప్పుడు సల్మాన్‌ఖాన్‌నుంచి కబురువచ్చింది. అదే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అంటాడు రాకేష్. ‘బాడీగార్డ్’ సినిమాకోసం సల్మాన్ తనను రమ్మన్నారని, అతడికి శిక్షణ ఇవ్వడం గొప్పగౌరవమని అంటాడు రాకేష్. ‘అమీర్, సల్మాన్, చరణ్‌సహా చాలామంది భారతీయ సెలబ్రిటీలు శరీర సౌష్టవాన్ని పెంచుకునేందుకు స్టెరాయిడ్స్ వాడతారనడం అన్నది పుకారు. చక్కటి ఆహారం, నియమబద్ధంగా, శరీరానికి తగిన శ్రమ కలిగిస్తూంటే ఆరోగ్యంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో కావలసినట్లు తయారవ్వచ్చని’ అంటాడు రాకేష్. ‘సల్మాన్ ఇంటినుంచి తెచ్చుకున్న ఆహారానే్న, అదీ అమ్మ చేతి వంటనే తీసుకుంటాడు. ఎంత బిజీగా ఉన్నా, రోజంతా షూటింగ్‌లో గడిపినా ఇంటికొచ్చాక ఒకటి రెండు గంటలు ‘్ఫట్‌నెస్’ వర్కవుట్స్ చేయకపోతే సల్మాన్‌కు నిద్రపట్టదని’ చెబుతాడు రాకేష్. ‘అమీర్‌ఖాన్ అయితే పెర్‌ఫెక్షనిస్ట్ అని చెప్పాలి, అనుకున్నది సాధించేదాక విశ్రమించడు. ‘దంగల్’ కోసం ఓ ముప్ఫై కేజీల బరువుపెరగడం, తక్కువ సమయంలో మళ్లీ పాతిక కేజీల బరువుతగ్గడం మాటలేంకాదుకదా, అది అమీర్‌కే సాధ్యమైంది, అందులో తానూ భాగస్వామిని కావడమే సంతోషం కలిగిస్తోంది’ అని అంటున్నాడు రాకేష్. తెలుగు హీరో రామ్‌చరణ్ ‘్ధృవ’ చిత్రంకోసం విభిన్నంగా, సన్నగా, నాజూకుగా కనిపించాలని నిర్ణయించుకున్నాక మంచి మిత్రుడైన సల్మాన్ సలహా కోరాడు. సల్మాన్ సలహా మేరకు చరణ్‌కు శిక్షణ ఇచ్చేందుకు రాకేష్ ఒప్పుకోవడం, ‘దంగల్’ బిజీలో ఉన్న అమీర్‌కు ఓ మాట చెప్పి హైదరాబాద్‌లో వాలిపోవడం జరిగిపోయింది. ‘్ధృవ’లో చరణ్ రూపురేఖలు ఆ చిత్రం విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. నిజానికి తన కుమారుడికి వ్యాయామంలో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన రాకేష్ పనితీరు చూసి ‘పికె’లో తనకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరాడట అమీర్‌ఖాన్. ‘దంగల్’లో అయితే రాకేష్ లేకపోతే అమీర్ లేనట్టేనని చెప్పాలి. అందుకే తన తరువాతి ప్రాజెక్టు ‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’కూ అతడినే ట్రెయినర్‌గా పెట్టుకున్నాడు. కేవలం శారీరక శ్రమే కాదు, ఎంత తినాలి, ఏం తినాలన్నది కూడా చెబుతా. వైద్యులు, న్యూట్రీషియన్ల సహాయం తీసుకుంటా. ఫిట్‌నెస్‌లో ఆధునిక యంత్రాలు, మెళకువలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా. ఏడాదిలో ఒకసారి అమెరికా వెళ్లి ఈ రంగంలో వచ్చిన అధునాత మార్పులపై అప్‌డేట్ అవుతానని చెప్పే రాకేష్ భారత కుస్తీ వీరులకు శిక్షణ ఇవ్వాలని ఉందంటాడు. ఒలింపిక్స్‌కు వెళ్లేవారికి ఫిట్‌నెస్ పాఠాలు చెప్పాలని ఉందని చెబుతాడు. సల్మాన్, అమీర్, చరణ్ రోజుకు నిర్ణీత పరిమాణం కన్నా ఒక్క కేలరీ ఆహారంకూడా అధికంగా తీసుకోరని అంటాడతడు. విదేశాల్లో ‘్ఫట్‌నెస్’ రంగం విస్తృతంగా ఎదిగింది. అక్కడివారి జీవన విధానాల్లో ఇది కీలకం. మనకూ అది అలవాటవ్వాలి’ అంటాడు రాకేష్. సరే...పేరుమోసిన సెలబ్రిటీలకైనా, సాధారణ పౌరులకైనా జిమ్‌కు వచ్చిన తరువాత ఒకేలా శిక్షణ ఇవ్వడం తనకు ఇష్టమని, అదే చేస్తూంటానని, అయితే సెలబ్రిటీలకు నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలు సాధించాల్సి ఉంటుంది కనుక వారి వర్క్‌వుట్ టైమ్‌టేబుల్, శిక్షణ విధానాలు, ఆహారం వంటి విషయాల్లో కొన్ని తేడాలుంటాయని చెప్పే రాకేష్..తను ఎక్కడి నుంచి వచ్చానో ఎప్పటికీ మరచిపోనని, తన విజయం వెనుక తల్లి శ్రమ, తమ చిన్నతనంలో చదివించిన ‘మిసెస్ బీనా చిబ్లాని’ ఆదరణ ఉన్నాయని అంటాడు రాకేష్. సల్మాన్ తదుపరి సినిమా ‘ట్యూబ్‌లైట్’కోసం వర్కవుట్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యాడు రాకేష్. అదేకదా అతడి వ్యాపకం.

చిత్రాలు..అమీర్‌ఖాన్, రామ్‌చరణ్ తో రాకేష్