యువ

ఆర్‌ఎఫ్‌ఐడి మరింత పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా ఆన్‌లైన్..టెక్నాలజీ సర్వస్వంగా సాగుతున్న ఆన్‌లైన్ హైవేల్లో అందరం పరుగులు పెడుతున్నాం. స్మార్ట్ఫోనే్ల అరచేతిలో ఇమిడిపోయే బ్యాంకులు, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా వినియోగదారుల మధ్య, బ్యాంకులు ఖాతాదారుల మధ్య లావాదేవీలు వేల్లో, లక్షల్లో జరిగిపోతాయి. ఈ నేపథ్యంలో ఎంతటి ఉద్దండులకైనా కొరుకుడు పడని..కేవలం హాకర్లు మాత్రమే పసిగట్టేసే కిటుకులెన్నో ఉంటాయి. మన కార్డు మన దగ్గరే ఉన్నా..మనకు తెలియకుండానే ఎక్కడో ఏదో తప్పుజరిగిపోతుంది..బ్యాంకులో ఉందనుకున్న మొత్తం మాయమైపోతుంది. ఆర్థిక లావాదేవీలే కాదు ఎన్నో కంపెనీలు, సంస్థలకు చెందిన కీలక సమాచారం కూడా లీకైపోయి కొంప ముంచేస్తుంది. ఆదమరిస్తే ఉన్నదంతా మటుమాయం చేసే మాయగాళ్లకు, హ్యాకర్లకు కొదవలేని నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో వీటికి విరుగుడు ఏమిటన్నదానిపై దీర్ఘకాలంగానే కసరత్తు జరుగుతోంది. ఇది ఓ కొలిక్కి రావాల్సిన తరుణమూ ఆసన్నమైంది. దీర్ఘకాలంగా క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ లావాదేవీల హాకింగ్ పేట్రేగిపోవడంతో దీన్ని అడ్డుకునే టెక్నాలజీపై దృష్టి పెట్టిన శాస్తవ్రేత్తలు ఆ దిశగా గణనీయమైన పురోగతే సాధించారు. సాధారణంగా పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు, మొబైల్ లావాదేవీల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడి)ని వినియోగిస్తారు. ఇది హాక్ కావడం వల్లే క్రెడిట్ కార్డులు, మొబైల్ లావాదేవీలు హాకింగ్‌కు గురవుతున్నాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీ అనివార్యంగా మారింది. అయితే ఆర్‌ఎఫ్‌ఐడి అప్లికేషన్లలో సెక్యూరిటీపరంగా ఎలాంటి అవరోధం తలెత్తినా మొత్తం వ్యవహారం మంటగలిసిపోతుంది. అంటే కీలక సమాచారం, వివరాలు లీకైపోతాయి. ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీ టాగ్‌లు ఎలక్ట్రానిక్ ఆర్‌ఎఫ్‌ఐడి రీడర్లకు అందే సమాచార సంకేతాల ద్వారా పనిచేస్తాయి. ఇందులో ఏ మాత్రం లోపం ఉన్నా..ఇది కట్టుదిట్టంగా లేకపోయినా హాకింగ్‌కు ద్వారాలు తెరిచినట్టే అవుతుంది. అంటే ట్యాగ్‌లు-రీడర్ల మధ్య జరిగే సమాచార సంకేతాల తతంగాన్ని మరింత సురక్షితం చేసేందుకు కొత్తగా ఆర్‌ఎఫ్‌ఐడి ప్రొటోకాల్స్‌ను శాస్తవ్రేత్తలు రూపొందిస్తున్నారు. వీటిని కొత్త ఫీచర్లతో మరింత భద్రతాయుతంగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌లో ఆర్‌ఎఫ్‌ఐడి సమాచారాన్ని పరిరక్షించే అంశంపై కూడా కొత్త మార్గాల్లో ముందుకు వెళుతున్నామని సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ ఇంగ్‌జియూ తెలిపారు. ముఖ్యంగా మొబైల్ చెల్లింపుల విధానంలో ఆర్‌ఎఫ్‌ఐడికి సంబంధించి ప్రత్యేకమైన టెక్నాలజీని వినియోగిస్తారు. రోజువారీగా స్మార్ట్ఫోనే్ల అన్నింటికీ కీలకం కావడం, బ్యాంకింగ్ లావాదేవీలు, చెల్లింపులకు ఇదే వేదిక కావడంతో మొబైల్ సెక్యూరిటీని మరింత సురక్షితం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

-బి సుధ