యువ

అందానికేదీ అందలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాల్లాంటి కళ్లు, కోటేరులాంటి ముక్కు, గులాబి రేకుల్లాంటి పెదాలు, నల్లజలపాతంలాంటి కురులు...నుదుటిపై ఎర్రటి బొట్టు...నవ్విందంటే సన్నజాజులు విరబూసినట్టే...అడుగు వేసిందంటే హంస హొయలే!
ఈ వర్ణనంతా భారతీయతను అణువణువునా సంతరించుకున్న మన అమ్మాయిల గురించేనని వేరుగా చెప్పాలా? అయితే ఇంతటి అందగత్తెలకీ తగిన గుర్తింపు లభించట్లేదు. అంతర్జాతీయ వేదికలపై మన అందం చిన్నబోతోంది. ఒకటా..రెండా? భారతీయ అందానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి 16 ఏళ్లవుతోంది!
సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్..ప్రపంచ అందాల పోటీల్లో భారతదేశం సత్తా చాటి చెప్పారు. ఒకే ఏడాది...1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్‌గా విజయబావుటా ఎగరేస్తే, ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్‌గా అందలం అందుకుంది. 2000లో లారా దత్తా, ప్రియాంక చోప్రా అదే సీన్‌ను రిపీట్ చేశారు. లారా మిస్ యూనివర్స్, ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై మన మెరుపులు మిస్సవుతూనే వస్తున్నాయి. తాజాగా 66వ మిస్ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ ఇటీవలే అమెరికాలో జరిగింది. పోర్టారికోకు చెందిన స్ట్ఫోనీ డెల్ వాలే మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మన దేశానికి చెందిన ప్రియదర్శిని చటర్జీ టాప్ 20లో మాత్రమే చోటు సంపాదించింది. ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో టాప్ 5లో నిలబడింది. కానీ ఏ విభాగంలోనూ ఆమెకు అగ్రస్థానం మాత్రం దక్కలేదు. ఆ మాటకొస్తే గత పదహారేళ్లుగా ఇండియా పరిస్థితి ఇలాగే ఉంది.
ఇదే విషయాన్ని మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్‌లో పాల్గొన్న సృష్టి వ్యాకరణంను అడిగితే అదే విషయం తనకూ అర్థం కావట్లేదన్నారు. బ్యూటీ కాంటెస్ట్‌లలో విజేతలను నిర్ణయించడానికి జడ్జీలు ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారో తెలియడం లేదన్నారు. ‘ఈసారి ప్రియదర్శిని ఏదోఒక విభాగంలో కచ్చితంగా గెలుస్తుందనే అనుకున్నాను. కానీ ఎక్కడ పొరబాటు జరిగిందో మరి. ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్స్’ విభాగంలో ఇతరులతో పోలిస్తే మిస్ ఫిలిప్పీన్స్ చాలా చక్కగా సమాధానాలు చెప్పింది. కానీ ఆ అమ్మాయి కనీసం రెండోరౌండ్‌లోకి కూడా ప్రవేశించలేకపోయింది’ అందామె.
మిస్ ఇండియా యూనివర్స్ (2011) టైటిల్ విజేత వాసుకీ సుంకవల్లి మాట్లాడుతూ ‘90వ దశకంలో మనం వరుసగా టైటిల్స్ గెలిచామంటే, అప్పట్లో ఇండియా ఆర్థిక సరళీకరణ విధానాలకు తెర తీసిన రోజులవి. కాబట్టి అప్పట్లో సౌందర్య సాధనాలన్నీ భారత మార్కెట్‌ను ముంచెత్తాయి. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు మన అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు పోటీ మరింత పెరిగింది’ అంటూ చెప్పుకొచ్చారు.
సినీ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ వాదన మరోలా ఉంది. ‘్భరతీయ అమ్మాయిలు అందాల పోటీల్లో రాణించాలంటే దానికి జరగాల్సిన కసరత్తు చాలా ఉంది. ఉదాహరణకు క్రీడాకారుల్నే చూడండి..వాళ్లని చిన్నప్పుడే గుర్తించి, వారి ప్రతిభకు సానబెడతారు. అందాల పోటీలు అంతే. కాని మన దేశంలో దానికి భిన్నంగా జరుగుతోంది. మన అమ్మాయిలు అందాల పోటీల్లో పేర్లు నమోదు చేసుకున్నాకే బడా కంపెనీలు గుర్తించి స్పాన్సర్ చేస్తున్నాయంతే. ఇలా అయితే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు.
వాసుకి వాదన కూడా ఇలాగే ఉంది. ‘నేను మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నాక, మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనేందుకు కేవలం 20-25 రోజులు మాత్రమే సమయం మిగిలింది. అదే ఇతర దేశాల్లో ఏడాదినుంచే అంతర్జాతీయ పోటీలకు సమాయత్తం అవుతారు. పైగా అందాల పోటీల్లో పాల్గొనేవారిలో చాలామంది కాస్మెటిక్ సర్జరీలూ చేయించుకుంటారు. వారిలో చాలామంది బార్బీ గర్ల్స్‌లా ఉండటానికి కారణమదే’ అంటారామె.

చిత్రాలు..సృష్టి వ్యాకరణం, ఐశ్వర్యరాయ్, ప్రియదర్శిని చటర్జీ