యువ

ఇది మరో దంగల్ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంగల్ సినిమా చూస్తున్నంతసేపూ పదహారేళ్ల అమ్మాయి మహిమా రాథోడ్ కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే- ఆ సినిమా కథ అచ్చం తన జీవిత కథనే పోలి ఉండటం.
అదేంటి? దంగల్ ..మహావీర్‌సింగ్ ఫోగట్ గురించి, అతని కూతుళ్ల గురించీ తీసిన సినిమా కదా అనేగా మీ సందేహం?
హర్యానా, మహారాష్టల్రలో రెజ్లింగే ప్రాణంగా బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ కుటుంబమే మహిమది కూడా. ఫోగట్ల కుటుంబం హర్యానాలోని బలాలీ గ్రామానికి చెందినదైతే, మహిమ కుటుంబానిది మహారాష్టల్రోని దుధగిరి గ్రామం. అంతే తేడా! మిగతా కథంతా ఒకటే!
మహిమ తండ్రి రాజూ రాథోడ్ ఓ వ్యవసాయ కూలీ. చిన్నప్పుడు మంచి రెజ్లర్ కూడా. రాష్టస్థ్రాయి పోటీల్లో రాణించినా డబ్బు లేక, ఇల్లు గడవడం కష్టం కావడంతో ఎంతో ఇష్టమైన రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పేసి, పొలం పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఆ మాటకొస్తే, రెజ్లింగ్ రాథోడ్‌ల కుటుంబంలోనే ఉంది. రాజు తాత, ఆయన ఎనిమిదిమంది అన్నదమ్ములూ కూడా పేరొందిన రెజ్లర్లే. అచ్చం దంగల్ సినిమాలో మాదిరిగానే- తాను రెజ్లింగ్‌ను వదిలేసినా, తన కొడుకునైనా గొప్ప రెజ్లర్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచింది. అచ్చం దంగల్ సినిమాలోలానే, కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టింది. దాంతో రాజు నిరాశలో కూరుకుపోయాడు. కానీ తన తమ్ముడు ఇచ్చిన సలహా విన్న తర్వాత కూతురైతేనేం..అనుకున్నాడు. మహిమకు ఆరేళ్ల వయసు రాగానే బరిలోకి దించాడు. రెజ్లింగ్‌లో తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే....
మహిమ ఇప్పుడు జాతి గర్వించదగిన రెజ్లర్లలో ఒకతె. గత ఏడాది జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతక విజేత.
అయితే రాజు రాథోడ్ కూడా మహావీర్‌సింగ్ ఫోగట్ మాదిరిగానే కూతుర్ని రెజ్లర్‌ని చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. పడుతున్నాడు. మరెన్నో అవమానాలు ఎదుర్కున్నాడు. మహిమతో రెజ్లింగ్ ఆడేందుకు అబ్బాయిలెవరూ ముందుకు వచ్చేవారు కాదట. దాంతో రాజూ అబ్బాయిలకు ఐదు పది రూపాయలు ఇచ్చి, తినుబండారాలు కొనిపెట్టి ఆడించేవాడట. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నా, రాజు కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్లేవాడు. అతన్ని చూసి అంతా కూతురి జీవితాన్ని పాడుచేస్తున్నావంటూ తిట్టిపోసేవారట. అవన్నీ లెక్కచేయకుండా మహిమను జాతీయస్థాయి రెజ్లర్‌గా తయారు చేయడమే లక్ష్యంగా ముందడుగు వేశాడు. అనుకోకుండా ఓ రోజు మహిమకు మహిళా రెజ్లర్లతో పోటీ పడే అవకాశం లభించింది. అందులో గెలిచి, ఆమె తాలూకా స్థాయి టోర్నమెంట్‌లో అవకాశం సంపాదించింది. అంతే..ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు గెలిచిన మహిమ, ఈ ఏడాది పాట్నాలో జరగబోయే జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతోంది.
ప్రస్తుతం దుధగిరి సమీపంలోనే ఉండే పుసాడ్ గ్రామంలోని కోశాట్వార్ విద్యాలయలో చదువుకుంటున్న మహిమ, అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. గతంలో రజత పతకం గెలిచినా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా ఆమెకు ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహం ఏమీ లేదు- 15వేల రూపాయల స్కాలర్‌షిప్ తప్ప.
దంగల్ సినిమా చూస్తున్నంత సేపూ అందులో మహావీర్‌సింగ్ ఫోగట్ పాత్రలో మా నానే్న కనిపించాడని చెబుతున్న మహిమ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, నాన్న పేరు నిలబెట్టడమే ధ్యేయమంటోంది. తన ప్రతిభను మెచ్చి, ప్రభుత్వం ఉద్యోగమిచ్చినా, ముందు రెజ్లర్‌గా కీర్తిప్రతిష్ఠలు సంపాదించడమే లక్ష్యమంటున్న మహిమకు ‘యువ’ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.