యువ

అవార్డులు.. రివార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో అవార్డులు.. రివార్డులు.. రికార్డులు హుస్నా సమీర ఖాతాలో చేరి మురిసిపోతున్నాయి. 2013లో కాలిగ్రఫీలో ఆమె నిపుణ జాతీయ అవార్డును స్వీకరించంది. 2014లో అవుట్‌స్టాండింగ్ క్యారమ్ ప్లేయర్‌గా ప్రఫుల్లా స్మారక అవార్డును తీసుకుంది. స్పీడ్ మాథమాటిక్స్‌లో ‘లిటిల్ స్టార్’ అవార్డు లభించింది. మల్టీ టాలెంటెడ్ చైల్డ్ బాలప్రభ అవార్డు, తెలంగాణ బాలరత్న అవార్డులను సొంతం చేసుకుంది. 2015లో తెలుగు తేజం, మహిళా పురస్కార్, ఉగాది ప్రత్యేక పురస్కారం, ఆకాశ్ ఎక్స్‌లెన్సీ అవార్డు, ఐలమ్మ స్ర్తిశక్తి అవార్డులను గెల్చుకుంది. ఇక రికార్డులకు కొదువ లేదు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఎవరెస్టు వరల్డ్ రికార్డు, లిమ్కా రికార్డు, గిన్నిస్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అసిస్ట్ వరల్డ్ రికార్డు, యూనివర్శల్ రికార్డు, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్... ఇలా ఒకటికాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో రికార్డులను నెలకొల్పింది. రికార్డు పుస్తకాల్లో సుస్థిర స్థానం సంపాదించింది. ‘రికార్డుల రారాణి’గా అవతరించింది.