యువ

ధీర ‘సమీర’ం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజీ హుషారు.. సరదా మాటలు..
షేక్ హుస్నా సమీరాను చూస్తే ఎవరికైనా సాదాసీదా కాలేజీ విద్యార్థిని గుర్తుకొస్తుంది. ఎలాంటి ప్రత్యేకతలు లేనట్టు కనిపిస్తుంది.
కానీ, ఆమె క్యారమ్ బోర్డు ముందు కూర్చున్న మరుక్షణం ఆమె తీరు మారిపోతుంది.
ఒక రాయిని శిల్పంగా తీర్చిదిద్దుతున్నప్పుడు శిల్పిలో ఉండే ఏకాగ్రత హుస్నా సమీరలో కనిపిస్తుంది. ఒక సంగీత విద్వాంసుడు సాధన చేస్తున్నట్టు.. ఒక చిత్రకారుడు కాన్వాసుపై కొత్త అందాలను ఆవిష్కరిస్తున్నట్టు.. జడత్వాన్ని విడిచి కాంతి శిఖరాలవైపు పరుగులు తీస్తున్నట్టు.. అచంచలమైన ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల ఆమెలోని ప్రతిభాపాటవాలను, అసాధారణ నైపుణ్యాన్ని, అద్వితీయ సాధనా సంపత్తిని మన కళ్ల ముందు సాక్షాత్కరింపచేస్తాయి. క్యారమ్స్ ఆమె ప్రపంచం.. ఆమె ఊపిరి.. హుస్నా సమీరాలో ఈ లక్షణాలకు తల్లి సాజిదా ప్రోత్సాహం, చిన్నాన్న షేక్ అబ్దుల్ ఖాదర్ మార్గదర్శకం, సురేష్ కుమార్ శిక్షణ జత కలిశాయి. ఆమెను ‘క్యారమ్ క్వీన్’గా, ‘రికార్డుల రారాణి’గా నిలబెట్టాయి. గిన్నిస్ రికార్డును ఆమె సొంతం చేశాయి.
క్యారమ్ బోర్డు లేని ఇల్లు ఉండదు.. ఎప్పుడో ఒకసారి క్యారమ్ ఆడని వారు ఉండరు. కానీ, తొంభైతొమ్మిది శాతం మంది క్యారమ్‌ను సరదగా ఆడుకునే ఆటగానే భావిస్తారు. దానిని ఒక క్రీడగా గుర్తించరు. అందులో కొత్తదనాన్ని ఆనే్వషించరు. అయితే, హుస్నా సమీర ఆలోచన వేరు. లక్ష్యం వేరు. క్యారమ్‌ను టెక్నికల్ గేమ్‌గా నిరూపించాలని కంకణం కట్టుకుంది. జాతీయ క్రీడగా గుర్తింపు పొందేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. గంటల తరబడి క్యారమ్స్ ఆడి.. ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నది. గిన్నిస్ రికార్డు సాధించింది. క్రీడాకారిణిగా ఎదగడం మాత్రమే కాదు.. క్రికెట్, టెన్నిస్ లేదా బాడ్మింటన్ మాదిరిగానే దీనికీ ప్రాచుర్యాన్ని తీసుకురావాలన్న పట్టుదల కూడా ఆమెలో కనిపిస్తుంది.
బహుముఖ ప్రజ్ఞ
అటు చదువులోనూ.. ఇటు ఆటల్లోనూ ప్రతిభాపాటవాలు కనబరచి, ఒకదాని తర్వాత మరొకటిగా అవార్డులను ఒకరే అందుకోవడాన్ని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో ఇది సులభసాధ్యం కాదన్నది వాస్తవం. కానీ, ఏకదీక్షతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని హుస్నా సమీర నిరూపిస్తున్నది. లెక్కల్లో ఆమె దిట్ట. స్పీడ్ మాథమాటిక్స్‌లో బహుమతులు సంపాదించుకుంది. టెన్త్‌లో ‘ఏ ప్లస్’ గ్రేడ్. కాలిగ్రఫీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. 32 రకాలుగా అక్షరాలను రాయగల సమర్థురాలు. క్యారమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే విజయవాడలో 34 గంటల, 45 నిమిషాల, 56 సెకన్లపాటు మారథాన్ క్యారమ్స్ ఆడి గిన్నిస్ రికార్డు సాధించింది. రికార్డును సృష్టించడం కంటే క్యారమ్స్‌కు తగిన గుర్తింపును తీసుకురావాలన్న తపన ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని రంగాల్లో ప్రవేశించినా చదువు, క్యారమ్స్ తన రెండు కళ్లుగా అభివర్ణిస్తున్నది హుస్నా సమీర. ఏ లక్ష్యం లేకుండా గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు వృథా చేస్తున్న చాలా మంది యువతీయువకులకు ఆమె మార్గదర్శకురాలు.
పెరటి చెట్టు..
ఎవరో.. ఎక్కడో.. ఏ చిన్న రికార్డును సృష్టించినా ఆకాశానికి ఎత్తేస్తాం. వరుస సన్మానాలతో హడావుడి చేస్తాం. నజరానాలతో ముంచెత్తుతాం. భుజకీర్తులు తగిలించి మురిసిపోతాం. కానీ, పెరటి చెట్టు మందుకు పనికిరాదన్న చందంగా హుస్నా సమీరాకు తగినంత గుర్తింపునివ్వలేకపోతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలు గర్వంతో తలెత్తుకునేలా చేసిన ఆమెను ప్రోత్సహించలేకపోతున్నాం. హుస్నా సమీర ఒక్కో టోర్నీకి వెళ్లాలన్నా, ఒక్కో రికార్డు నెలకొల్పాలన్నా లక్షల్లో ఖర్చవుతున్నది. మధ్య తరగతికి చెందిన ఆమె కుటుంబ సభ్యులు అటు ఖర్చులను భరించలేక, ఇటు ఆమె ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేక నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ క్రీడల మంత్రి టి. పద్మారావు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి అలాంటి హామీ కూడా లభించలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు హుస్నా సమీర తల్లి సాజిదా చేసుకున్న విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయో లేక అధికారులకు చేరినా పట్టించుకోలేదో తెలీదుగానీ ఇప్పటి వరకూ ఆ అవకాశమే లభించలేదు. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆమె ప్రతిభను గుర్తించి, తగిన విధంగా ప్రోత్సహిస్తాయని ఆశిద్దాం.

‘క్యారమ్స్ ఒలింపిక్ క్రీడ కాదు. దీనిని టెక్నికల్ గేమ్‌గా గుర్తించినా, ఒలింపిక్స్‌లో స్థానం దక్కలేదు. ఫలితంగా జాతీయ స్థాయిలోనూ దీనిని ఒక ప్రొఫెషనల్ క్రీడగా పరిగణించడం లేదు. క్రీడాకారుల కోటాలోనూ క్యారమ్స్‌కు స్థానం లేకపోవడం దురదృష్టకరం. ఇది ఒలింపిక్ క్రీడగా గుర్తింపు సంపాదించుకోవాలన్నది నా కోరిక. మన దేశంలోనూ క్యారమ్స్‌కు తగిన ప్రాధాన్యం లభించాలని ఆశిస్తున్నాను. ఒకదాని తర్వాత మరొకటిగా రికార్డులు సృష్టించే ప్రయత్నాన్ని కొనసాగించడం వెనుక అసలైన లక్ష్యం కూడా అదే. త్వరలోనే నా కల నెరవేరుతుందని నమ్ముతున్నాను’

‘తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితులు, సన్నిహితుల మద్దతు లేకపోతే నేను ఏదీ సాధించే ఉండేదాన్ని కాను. నేను చదువుకున్న పాఠశాల, చదువుతున్న కళాశాలలోనూ ప్రతి ఒక్కరూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తునే ఉన్నారు. నా ప్రతి రికార్డులో, అవార్డులో ప్రతి ఒక్కరికీ వాటా ఉంది’.

చిత్రం..షేక్ హుస్నా సమీరా

-విశ్వ