యువ

బాడీపవర్ చూపించిన హైదరాబాద్ కుర్రాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజ్లింగ్, జూడో, బాక్సింగ్ వంటి క్రీడలగురించి అందరికీ తెలుసు. కానీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసిన వారు చాలా తక్కువమందే. ఇంతకీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమిటి? నిజానికి ఇది కూడా ఓ ఆటే. రెజ్లింగ్, జూడో, బాక్సింగ్, మ్యూ థాయ్...ఈ నాలుగు క్రీడల కలబోతే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్. ఈ గేమ్ గురించి ఇంత డిటైల్డ్‌గా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే...ఇందులో హైదరాబాద్ కుర్రాడు జీషన్ సయ్యద్ విజయ పతాకను ఎగురవేయడమే అందుకు కారణం. ముంబయిలో ఇటీవల జరిగిన బాడీపవర్ ఎక్స్‌పోలో పాతికేళ్ల జీషన్ వెల్టర్ వెయిట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. దీంతో అందరి దృష్టీ ఒక్కసారిగా జీషన్‌పై పడింది.
కోచ్ షేక్ ఖలీద్ వద్ద జీషన్ శిక్షణ తీసుకున్నాడు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు ఖలీద్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ క్రీడలో ఎంతోమంది ఆటగాళ్లను తయారు చేసిన ఘనత ఆయన సొంతం. జీషన్‌లోని పట్టుదల, చురుకుదనం చూసిన ఖలీద్ అతనికి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే తన శిక్షణ విషయాన్ని జీషన్ తల్లిదండ్రుల వద్ద దాచి ఉంచాడట. దానికి కారణం ప్రమాదకరమైన ఈ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిస్తే వారు ఒప్పుకోరనే. ముంబయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వారం రోజుల ముందు మాత్రమే జీషన్ తన తల్లితో ఈ విషయం చెప్పాడట. రెండేళ్లుగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సిటీ యువతను ఖలీద్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆటలో రాణించే సత్తా మన యువకులకు ఉన్నా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే మాత్రం ఇంకా సమయం పడుతుందని ఆయన అంటున్నారు.
ముంబయిలో జరిగిన బాడీపవర్ ఎక్స్‌పోలో పతకాల పట్టికలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని, త్వరలో ప్రథమ స్థానం ఆక్రమించే అవకాశం లేకపోలేదని ఖాలీద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.