యువ

పరిశుభ్రతకు ఫ్రీ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారా?
మహిళలను గౌరవిస్తారా?
అయితే సచిన్ శర్మ ఆటోలో ఫ్రీగా ప్రయాణించొచ్చు!
ఎవరా సచిన్ శర్మ?...ఏమా కథ? అనుకుంటున్నారా? అయితే చదవండి మరి...
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ మామూలు ఆటోడ్రైవర్ సచిన్ శర్మ. అయితేనేం...ప్రధాని స్వచ్ఛ భారత్ పిలుపునకు స్పందించి, తనవంతు కృషి చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆటోకొక డస్ట్‌బిన్ బిగించాడు. తన ఆటో ఎక్కే ప్రయాణికులు చెత్తను పారవేయాలనుకుంటే, అందులోనే వేయాలి. రోడ్డు మీదో, ఆటోలోనే వేయకూడదు. అలాగే పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు తన వంతుగా ప్రయాణికులనుంచి హామీ తీసుకుంటాడు. వారు అందుకు సరేనంటే, పనిలో పనిగా మహిళలను గౌరవిస్తామంటే వారిని ఉచితంగానే గమ్యస్థానానికి చేరుస్తాడు. ఈ పద్ధతికి సచిన్ ఈ జనవరి 1నుంచీ శ్రీకారం చుట్టాడు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకూ ఇలా ప్రయాణికులను ఉచితంగా తిప్పుతాడు.
సచిన్ గత డిసెంబర్‌లోనే ఆటో కొన్నాడు. ఢిల్లీ-నోయిడా మధ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటో ఎక్కే ప్రయాణికులు తమతోపాటు వేరుసెనగకాయలో, బఠాణీలో తెచ్చుకుంటారు. కాలక్షేపానికి అవి తింటూ ప్రయాణిస్తారు. తొక్కల్ని మాత్రం ఆటోలోనో, రోడ్డుపైనో పారేస్తారు. దీనిని నివారించేందుకు సచిన్ ఆటోలోనే ఓ చెత్తబుట్టను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం చెత్తబుట్టను ఆటోకు బయటవైపు బిగించకూడదు. కాబట్టి సచిన్ ఢిల్లీలో తిరిగేటప్పుడు ఆ చెత్తబుట్టను ఆటోలోనే పెడతాడు. ఢిల్లీ సరిహద్దులు దాటగానే దానిని తీసి, ఆటోకు వెనకాలవైపు బిగిస్తాడు. సచిన్ కృషికి ఇప్పుడు వేనోళ్ల ప్రశంసలు లభిస్తున్నాయి. ఢిల్లీ మున్సిపల్ అధికారులు కూడా అతని సేవలను గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సచిన్‌ను సన్మానించాలని వారు నిర్ణయించారు.