యువ

అనగనగా ఓ చిన్నారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంస మధిర!
పదకొండేళ్ల ఈ చిన్నారి సాధించింది తక్కువేమీ కాదు!
పద్నాలుగేళ్ల లోపు బాలబాలికలకు నిర్వహించిన చిన్న కథల పోటీల్లో హంస మూడో స్థానాన్ని సంపాదించింది. అయితే ఈ పోటీ రాష్ట్ర స్థాయిలోనో, జాతీయ స్థాయిలోనో జరిగింది కాదు. 52 కామన్‌వెల్త్ దేశాల స్థాయిలో జరిగిన పోటీలు. బ్రిటిష్ కౌన్సిల్ ఈ పోటీలను నిర్వహించింది.
హైదరాబాద్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న హంసకు కథల పోటీల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఒకవైపు శాస్ర్తియ సంగీతం, మరోవైపు పియానో నేర్చుకుంటున్న తమ కుమార్తె కథల పోటీలో పాల్గొనడం ఆమె తల్లిదండ్రుల్నే ఆశ్చర్య పరిచిందట. అయితే ఈ పోటీలకు ఇచ్చిన సబ్జెక్ట్ తనను బాగా ఆకట్టుకుందని, బాగా రాస్తాననే నమ్మకం కుదిరాకే పోటీలో పాల్గొనేందుకు పేరు ఇచ్చానని హంస చెప్పింది. ఇంతకీ ఈ పోటీలకు ఇచ్చిన సబ్జెక్ట్- బిలాంగింగ్!
తాను రాసే కథకు హంస ఓ విషాద గాథను ఇతివృత్తంగా ఎంచుకుని, దానిని హృద్యంగా మలిచింది. ‘అనగనగా ఓ చిన్నారి బాలిక. తల్లిదండ్రులు, అక్కతో కలసి చెన్నైలో చదువుకుంటూ ఉంటుంది. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె తల్లితో కలసి హైదరాబాద్ వచ్చేస్తుంది. స్నేహితులందర్నీ వదిలి వచ్చేందుకు ఇష్టపడని ఆ చిన్నారి, తాను చెన్నైలోనే ఉండి చదువుకుంటానని ఎంత చెప్పినా తల్లిదండ్రులు ఒప్పుకోరు. అక్క మాత్రం చెన్నైలోనే తండ్రితోపాటు ఉండిపోతుంది. అక్క ఎంచక్కా చెన్నైలోనే ఉన్నప్పుడు తాను ఎందుకు హైదరాబాద్ రావలసి వచ్చిందో ఆ చిట్టితల్లికి అర్థం కాదు. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె అక్క క్యాన్సర్‌తో చనిపోతుంది. ఇంతకాలం ఆమె తండ్రితో చెన్నైలోనే ఉండిపోవడానికి కారణం కూడా క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ కోసమేనని ఆ చిన్నారి తెలుసుకుంటుంది. అక్క కోసం పరితపిస్తుంది. అప్పుడు ఆమెకు తెలుస్తుంది- బిలాంగింగ్ అంటే చుట్టూ ఉండే పరిసరాలు కాదు...చుట్టూ ఉండే తనవాళ్లేనని’- ఇదీ హంస ఎంచుకున్న ఇతివృత్తం. ఇంత బాగా కథ ఎలా రాయగలిగావు అనడిగితే ‘మా నాన్నగారు చదువుకునే రోజుల్లో ఎలక్యూషన్ (వక్తృత్వ పోటీలు) కాంపిటీషన్స్‌లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవారట. మా నాయనమ్మ నవలలు రాసేదట. బహుశా ఆ జీనే్స నాకూ వచ్చి ఉంటాయ’ని తెలివిగా చెప్పింది హంస.

చిత్రం..హంస మధిర