యువ

క్షణాల్లో అంబులెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రతి క్షణమూ అమూల్యమైనదే. ఆ సమయంలో వెంటనే అంబులెన్స్ దొరక్క ప్రాణాలు పోయిన వారు వేలల్లో ఉంటారు. ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గంటలోగా ఆస్పత్రికి తరలించగలిగితే వారి ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. దానినే ‘గోల్డెన్ అవర్’ అంటారు. 108 సర్వీసులు వచ్చాక అంబులెన్సులు అందుబాటులోకి వచ్చిన మాట నిజమే అయినా, కొరత మాత్రం పూర్తిగా తీరలేదనే చెప్పాలి. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు చేసిన ప్రయత్నం ఈ కొరతను భర్తీ చేస్తోంది. జైమన్ జోస్, రోహిత్ కుమార్- ఇద్దరూ ఐటి ఉద్యోగులు. ఈ ఇద్దరూ కలిసి రూపొందించిన అంబీ (ఱఉఉ) యాప్ ఇప్పుడు క్షతగాత్రుల పాలిట వరమయింది. అదెలాగో తెలుసుకుందాం...
2015లో ఓ రోజు జైమన్ స్నేహితుడొకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనితోపాటే ఉన్న జైమన్ వెంటనే అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు. కానీ అది ఒకపట్టాన దొరకలేదు. చివరకు ఎవరినో పట్టుకుని, వారి కారులో స్నేహితుణ్ని ఆస్పత్రికి తరలించాడు. స్నేహితుడు కోలుకున్నా, ఈ సంఘటన జైమన్‌ను ఆలోచనలో పడేసింది. అంబులెన్సులు దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించేసరికి, అతనికి చాలా రోజులు నిద్ర పట్టలేదు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే- ఆంబీ యాప్.
సరిగ్గా రోహిత్ జీవితంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అతని తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమెను తరచూ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ దొరికేది కాదు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. దాంతో అంబులెన్స్ సర్వీసులను క్షతగాత్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేయాలనుకున్నాడు. అదే సమయంలో జైమన్ గురించి తెలిసింది. వెంటనే అతనితో చేతులు కలిపాడు. ఆంబీ యాప్ రూపకల్పన మదిలో మెలిగాక జైమన్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పటివరకూ తాను నడుపుతున్న ఫస్ట్ కన్సల్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపునే ఆంబీ యాప్‌ను లాంచ్ చేశాడు.
జైమన్, రోహిత్ ఇద్దరూ కలసి హైదరాబాద్‌లో ఎన్ని అంబులెన్స్ సర్వీసులు ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు వంటి వివరాలు ఆరా తీశారు. నగరంలో వందలాది అంబులెన్సులు ఉన్నా, అవి అసంఘటిత రంగంలో ఉన్నాయి. ఎవరి ఫోన్ నంబర్లు వారివి. ఇవన్నీ రోగులకు లేదా క్షతగాత్రులకు తెలిసే అవకాశం లేదు. వాటన్నిటి వివరాలను క్రోడీకరిస్తూ ‘ఆంబీ’ని రూపొందించారు. ఉబెర్ సర్వీసుల మాదిరిగానే ఈ యాప్ కూడా అంబులెన్స్‌ను క్షణాల్లో ఇంటిముందు ఉంచుతుంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి రానుంది.

చిత్రం..జైమన్, రోహిత్