యువ

పట్టుదలే విజయసోపానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ జనాభాలో గణనీయ పరిమాణంలో ఉన్న యువతకు అవకాశాలకు కొదవలేదు. సవాళ్లు, సమస్యలు ఎన్నో ఉన్నా కెరీర్‌పరంగా నిర్ధుష్టమైన వ్యూహంతో నిర్ధిష్టమైన మార్గంలో ముందుకు వెళ్లగలిగితే అవకాశాలు అవే అందివస్తాయి. ఏ విధంగా చూసినా ఇది పోటీ ప్రపంచం. హద్దులు లేని అవకాశాల ఆవని. చదువుకున్న చదువుకు సార్ధకత ఉండాలంటే అందుకు తగ్గ రీతిలోనే కెరీర్‌ను పెంపొందించుకోవాలి. గతంలోకంటే కూడా ఈ రకమైన కెరీర్ అవకాశాలు అపరిమితంగానే అందుబాటులో ఉన్నాయి. 135 కోట్లు దాటిని భారత్ జనాభాలో సగటు వయస్సు 40 సంవత్సరాలు కావడం భవిత మనదేనని చెప్పడానికి, సరైన సాధన, పట్టుదల, అంకితభావం ఉంటే విశ్వవేదికపై భారత్ జయకేతనం ఎగరేస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కర్లేదు. ఏ దేశానికైనా యువతే శక్తీ,దీప్తి.చాలా సంపన్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యువజనాభా అణగారిపోవడమే. అంటే భవిష్యత్‌లో చాలా సంపన్న దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుందే తప్ప యువజనాభా పెరిగే అవకాశం కానరావడం లేదు. జపాన్ సహా అనేక దేశాలు ఈరకమైన సమస్యనే ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువశక్తితో ఇనుమడిస్తున్న భారత్ ఆశావాహంగా ముందుకు దూసుకుపోతోంది. ఏ దేశ యువతకైనా ఇది చాలా అరుదైన ఎప్పుడోగాని లభించని అవకాశం. దీన్ని అందిపుచ్చుకోగలిగితే అవకాశాలతో సమానంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనగలిగితే దేశ యువతకు ఉజ్వల భవిష్యత్తే. సవాళ్లకు బెదరకుండా పట్టుదలతో ముందుకు సాగితే నేటి యువత జీవితాలు సర్వతోముఖంగా విలసిల్లగలుగుతాయి. ఉద్యోగం, ఉపాధితోపాటు జీవన శైలిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకుంటూ విలువలు ప్రోదిచేసుకుంటున్న భవిత దిశగా అడుగువేయగలిగితే మన దేశ ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయి. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు కావల్సిన నైతికవర్తనం పెంపొందించుకోవాలి. ఆదే జీవితంలో ముందుకు సాగడానికి గీటురాయి అవుతుంది.