యువ

అన్నదమ్ముల కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడుకు చెందిన దశరథన్, ధన్‌రాజ్ అన్నదమ్ములు. దశరథన్ రష్యాలో ఎంబిబిఎస్ చదువుతుంటే తమ్ముడు ధన్‌రాజ్ జబల్పూర్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. ఇందులో విశేషమేముందీ అనుకుంటున్నారా? వీరిద్దరూ ఒకప్పుడు ఇటుకల బట్టీలో పనిచేసే కూలీలు. అదే విశేషం! బాల కార్మికులను వెతికి పట్టుకుని వారికి విముక్తి కల్పించేందుకు శ్రమించే ఉమ, ఓ సందర్భంలో ఓ ఇటుకల బట్టీకి వెళ్లినప్పుడు అక్కడ ఈ ఇద్దరు సోదరుల్నీ చూసింది. బట్టీ యజమానిని ఒప్పించి, వారిని తన వెంట తీసుకువెళ్లింది. వారికి చదువు సంధ్యలు నేర్పి, ప్రయోజకుల్ని చేసే దిశగా తీర్చిదిద్దుతోంది. ‘ఉమ, ముత్తురామ్ దంపతులు మాకు మారుటి తల్లిదండ్రులు. సుయమ్ చారిటబుల్ ట్రస్ట్‌కు మేమెంతో రుణపడి ఉన్నాం. మా అభిరుచిని గుర్తించి, ఆ దిశగా చదువు సాగించేందుకు వారు అందించిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అంటారు ఈ అన్నదమ్ములు.