యువ

‘జయ’కేతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయవేల్... చెన్నై రోడ్లపై బిచ్చమెత్తుకునే కుర్రాడు. అతని తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. చేసిన అప్పులు తీర్చలేక, ఉపాధిని వెతుక్కుంటూ ఆ కుటుంబం చెన్నైకి వలసవెళ్లింది. అక్కడ ఉపాధి లభించక బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టారు. చిన్నారి జయవేల్ ముగ్గురు అక్కలూ, తమ్ముళ్లతో కలసి రోడ్లపై సిగ్నల్స్‌వద్ద బిచ్చమెత్తుకునేవాడు. జయవేల్‌కు మూడేళ్ల వయసు వచ్చేసరికి తండ్రి మరణించాడు. దాంతో వారి కేరాఫ్ అడ్రస్ ఫుట్‌పాత్ అయింది. ఓ రోజు నడిరోడ్డుపై అడుక్కుంటున్న జయవేల్‌ను ఉమ, ముత్తురామ్ చూశారు. సుయమ్ చారిటబుల్ ట్రస్ట్‌కు తీసుకొచ్చారు. అతనిని చదివించి, పైకి తీసుకొచ్చారు. ఇంటర్ చదివాక జయవేల్..కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాసయ్యాడు. యుకెలోని రెక్జామ్‌లో గ్లిండ్వర్ వర్శిటీకి వెళ్లి ‘పెర్‌ఫార్మెన్స్ కార్ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్’ చదివాడు. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ టెక్నాలజీ చదవబోతున్నాడు. వీటన్నింటి వెనుక ఉమ దంపతుల ప్రోత్సాహం, సహకారం ఉన్నాయి. చదువు పూర్తవగానే మంచి ఉద్యోగంలో చేరి, తల్లికి ఓ ఇల్లు కట్టిస్తానని చెప్పే జయవేల్...ఉమ, ముత్తురామ్‌ల బాటలో నడిచి అనాథల సేవలో తరిస్తానంటున్నాడు.