యువ

ఎవరీ రీన్‌హార్డ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం అంకెల ఆధారంగానే అభివృద్ధిని నిర్వచించలేం. సామాజిక, పరిసరాల ప్రభావం ఆధారంగానే అభివృద్ధికి నిర్వచనం చెప్పాలి.
-యురికే రీన్‌హార్డ్

**
రీన్‌హార్డ్ జర్మనీకి చెందిన ఓ సామాజికవేత్త. యూనివర్శిటీ ఆఫ్ మాన్‌హీమ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్‌లో పట్టా తీసుకున్నారు. చదువుకుంటూనే అప్పట్లో జర్మనీలో ప్రముఖ టీవీ ఛానెళ్లయిన ఏఎఫ్‌డి, జడ్‌డిఎఫ్‌లలో కొంతకాలం పనిచేశారు. ఎనిమిదో దశకమంతా ఆమె బే ఏరియాలో గడిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఆలోచించడం తన అలవాటని చెప్పే రీన్‌హార్డ్, మనుషుల మధ్య స్నేహ సంబంధాలను ప్రోది చేయడంలో ఓ ఉత్ప్రేరకంలా పనిచేస్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల అడ్డుగోడల్ని ఛేదించుకుని బయటకు వచ్చిన రీన్‌హార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను సందర్శించారు. ఎంతోమంది ప్రముఖులను కలుసుకున్నారు. వారిలో నోబెల్ బహుమతి గ్రహీతలూ ఉన్నారు. అభిప్రాయాలను కలబోసుకుంటే కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయంటారామె. నాలుగేళ్ల కిందట ఇండియాతో ఆమె బంధం పెనవేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని మాడ్లా ప్రాంతంలో పన్నా నేషనల్ టైగర్ పార్క్ సమీపంలో ఆమె నివాసం. ఎక్కడికి వెళ్లాలన్నా ‘బులెట్’పైనే వెడతారు. దానికి ‘శ్రీని’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. ఓసారి స్నేహితులతో కలసి ఖజురహో సందర్శించినపుడు అసమానతల మధ్య నలిగిపోతున్న చిన్నారుల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించేందుకు ఓ స్కూల్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించిందట. వెంటనే ఆమెకు స్ఫురించిన ఆలోచన ‘స్కేటిస్తాన్’! ఆప్ఘనిస్తాన్‌లో సక్సెస్ అయిన స్కేటిస్తాన్‌నే మోడల్‌గా తీసుకుని జాన్వర్‌లో ఆమె స్కేట్‌పార్క్‌కు ఊపిరులూదారు.

చిత్రం..తన బుల్లెట్ ‘శ్రీని’పై రీన్‌హార్డ్