యువ

ఢిల్లీ కుర్రాడికి భారీ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్ రాజ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల సిద్ధార్థ్‌ను ఉబర్ టెక్నాలజీస్ సంస్థ భారీ ప్యాకేజ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడమే దీనికి కారణం.
సిద్ధార్థ్ (21) ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చేశాడు. పదో తరగతి వరకూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివిన సిద్ధార్థ్ చిన్నప్పటినుంచీ చదువులో ముందుండేవాడు. ఇంటర్‌లో 95% మార్కులతో పాసైనా, ఐఐటిలో సీటు సంపాదించలేకపోయాడు. అయితే నిరాశ పడకుండా అర్హత పరీక్షలు రాసి డిటియులో చేరాడు. అక్కడ 95% మార్కులతో పాసయ్యాడు. తాజాగా ఉబర్ టెక్నాలజీస్ సిద్ధార్థ్‌ను 1.25 కోట్ల వార్షిక వేతనంపై రిక్రూట్ చేసుకోవడం సంచలనం కలిగించింది. వాస్తవానికి అతని వార్షిక వేతనం 71 లక్షల రూపాయలే అయినా ఇతర అలనెన్సులతో కలిపి 1.27 కోట్లకు చేరింది. త్వరలో ఉద్యోగంలో చేరేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరి వెడుతున్న సిద్ధార్థ్ ఉబర్ ఆఫర్ ఎంతో సంతోషాన్ని కలిగించిందంటున్నాడు. సిద్ధార్థ్ తండ్రి ప్లానింగ్ కన్సల్టెంట్‌గానూ, తల్లి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానూ పనిచేస్తున్నారు. అయితే డిటియునుంచి ఇంత భారీ వేతనంపై రిక్రూట్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇదే యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని గూగుల్ 1.27 కోట్ల వేతనంపై నియామకం జరిపింది.