యువ

భలే అమ్మాయిలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో 20 శాతం మంది అమ్మాయిలు రజస్వల కాగానే చదువులకు స్వస్తి చెబుతున్నారు
- ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలిన నిజం.
***
నిరక్షరాస్యతలో మగ్గిపోతున్న చిన్నారులను బడిబాట పట్టించే కార్యక్రమాలు మన దేశంలో ఎన్నో అమలవుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా అమలుకు శ్రీకారం చుట్టిన ‘బేటీ బచావో...బేటీ పఢావో’ కూడా అలాంటిదే. అయినా చాలామంది చదువులకు దూరంగానే ఉంటున్నారు. దీనికి ఎన్నో కారణాలు. వాటిలో ప్రధానమైనది..బాలికల సమస్య. బహిష్టు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోవడం, శానిటరీ నాప్‌కిన్స్ కొనుగోలు చేసే ఆర్థిక శక్తి లేకపోవడం. దీంతో పాఠశాలకు గుడ్‌బై చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఢిల్లీకే చెందిన శరణ్యదాస్ శర్మ అనే పదమూడేళ్ల అమ్మాయి ఈ విషయాన్ని ఓ పత్రికలో చదివింది. ‘అయ్యో పాపం’ అని వదిలేయకుండా తన వంతు సాయం చేయాలనుకుంది. స్నేహితురాలు అమియా విశ్వనాథన్‌తో కలసి చర్చించింది. శ్రీరామ్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఈ ఇద్దరూ కలసి ఓ పథకానికి రూపకల్పన చేశారు. దాని పేరే సశక్తి.
సశక్తి పథకం కింద వీరిద్దరూ వీలైనన్ని పాఠశాలలకు వెళ్లి ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ అందిస్తున్నారు. అయితే అంతటితో సరిపెట్టడం లేదు. బాలికలకోసం వర్క్‌షాప్ నిర్వహిస్తారు. అంతకంటే ముందు ఏ పాఠశాలలో అయితే వర్క్‌షాప్ పెడతారో, ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్ల వివరాలు సేకరించి, వారితో మాట్లాడతారు. సదరు పాఠశాలలో బాలికలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు డాక్టర్లను ఒప్పిస్తారు. ఆ తర్వాత వర్క్‌షాప్‌లో బాలికలకు రుతుక్రమం గురించి, ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. చదువుకోవడం ఎంత ముఖ్యమో, ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో వివరిస్తారు. మొదటిసారి వారికి శానిటరీ నాప్‌కిన్స్‌ను స్వయంగా అందజేస్తారు. ఆ తర్వాత నెలనెలా ఆయా స్కూళ్లకు పార్శిల్ పంపుతారు. అయితే తాము అందజేస్తున్న సాయంలోనూ ఓ లోపాన్ని గుర్తించింది శరణ్య. శానిటరీ నాప్‌కిన్స్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఓ పత్రికలో చదివిన శరణ్య ఇకపై బయోడీగ్రేడబుల్ పాడ్స్‌నే పంపిణీ చేయాలని భావిస్తోంది.గత ఏడాది సశక్తికి శ్రీకారం చుట్టిన శరణ్య, అమియా ఇప్పటివరకూ ఢిల్లీలోనూ, ఆ చుట్టుపక్కల పాఠశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్ పంచిపెట్టారట. పదో తరగతి పరీక్షలు రాశాక తాము ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని, తమ చదువులకు ఇబ్బంది కలగకుండా ‘సశక్తి’ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని చెబుతున్న శరణ్య...్భవిష్యత్తులో తమ ప్రాజెక్టును మరింత విస్తరిస్తామని చెబుతోంది. శరణ్య, అమియాలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఢిల్లీలో అనేక సంస్థలు బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

చిత్రం..శరణ్యదాస్ శర్మ, అమియా విశ్వనాథన్