యువ

డ్రోన్లపై గద్దల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలిలో ఎగిరే బుల్లి బుల్లి విమానాలు...డ్రోన్లు.
వీటివల్ల ప్రయోజనాలు ఎన్నో, అక్రమార్కుల చేతిలో పడితే దుష్ప్రయోజనాలూ అనే్న ఉన్నాయి.
ఉగ్రవాదులు సైతం డ్రోన్లను ఉపయోగించి, విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదని అగ్రరాజ్యం అమెరికా సైతం తల్లడిల్లుతోంది.
ఈ నేపథ్యంలో డ్రోన్ల వాడకానికి సంబంధించి ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకమైన చట్టాలను రూపొందిస్తోంది. చట్ట విరుద్ధంగా తిరిగే డ్రోన్ల భరతం పట్టేందుకు ఆయా దేశాలు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ దేశం గద్దలను రంగంలోకి దించబోతోంది. అనుమతి లేని డ్రోన్లను ఎలా నేలకు దింపాలో గద్దలకు శిక్షణ ఇస్తోంది. దీనికోసం పిల్ల గద్దలను ఎంచుకుంది. ఇప్పటికే పాడైన డ్రోన్లతో ముందుగా వాటికి ఫ్రాన్స్ పోలీసులు శిక్షణ ఇస్తున్నారు. ఈ డ్రోన్లపై ఆహారాన్ని పెట్టి, తినిపించడం, వాటి మీద దాడి చేసి, వాటిని ముక్కున కరచుకుని, కిందకు దించడం వంటి పనుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిశాక చక్కటి ఆహారాన్ని పెడుతున్నారు. ఇలా మచ్చిక చేసుకున్నాక, వాటిని అసలు దాడులకు పురిగొల్పుతారట. నేలనుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గద్దలు డ్రోన్లపై యుద్ధానికి సరైన ఆయుధాలని ఫ్రాన్స్ భావిస్తోంది.