యువ

నేల విడిచి సాము చేటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిగ్రీ పూర్తయింది మొదలు ప్రతి ఒక్కరికీ కెరీర్ సమస్య. ఉద్యోగ జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? అనుకున్న లక్ష్యాలను ఎలా ప్రారంభించాలి? అన్నదే ప్రతి ఉద్యోగార్థికి ప్రధానమవుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఏదీ జరగదు. కోరుకున్నదే తడవుగా ఏ ఉద్యోగమూ ఒళ్లో వాలిపోదు. అందుకు సంబంధించి ఎంతో తతంగం ఉంటుంది. అర్హతలు, నైపుణ్యం, విద్యాస్థాయి, అన్నింటికీ మించి మనం ఆశిస్తున్న ఉద్యోగానికి తగ్గ ప్రతిభ మనకి ఉందా అన్నది కూడా కీలకమే అవుతుంది. చాలామందికి దీనిపట్ల సరైన అవగాహన లేకపోవడం, దరఖాస్తు చేసిన మరుక్షణమే వస్తుందనుకున్న ఉద్యోగం రాకపోవడం తీవ్ర నిరాశా నిస్పృహలకు కారణమయ్యేదే. ఇలాంటి పరిస్థితి ఎదురైన ప్రతి ఒక్కరూ ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. ఇక తమ జీవితం అంతేనని, ఇక ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదన్న ఆందోళన, బెంగ ముప్పుతిప్పలు పెట్టేస్తాయి. అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా నేల విడిచి సాము చేయకపోవడమన్నది మన అర్హతలకు నిదర్శనమవుతుంది. అందని మావిని అందుకోవాలని తపించి భంగపడే కంటే అందుబాటులో వున్నదానితోనే సంతృప్తి పడటమన్నది జీవిత సత్యం, జీవన వాస్తవం కూడా. అందుకే మన అర్హతలే మన కెరీర్‌కు గీటురాయి కావాలి. వాటికి భిన్నంగా వెళ్లాలంటే అందుకు తగ్గ అదనపు అర్హతలను సంతరించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దరఖాస్తులో వాస్తవాలనే ప్రస్ఫుటించాలి. లేనిపోనివి ఆపాదించుకుని తీరా వాటి విషయానికి వచ్చేసరికి చేతులెత్తేసేకంటే మనం ఏం చేయగలమో వాటినే చెప్పడం సరైన పద్ధతి. ఈ మధ్యకాలంలో వందల వేల సంఖ్యలో కంపెనీలు వెలుస్తున్నాయి. అన్నీ కూడా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు యువతను ఆదుకునేందుకు ఉద్దేశించినవే. అయితే ప్రతి కంపెనీకి ఓ లక్ష్యం వుంటుంది. ఓ విధానం ఉంటుంది. తాము తీసుకోబోయే అభ్యర్థుల్లో ఏ రకమైన ప్రతిభ ఉండాలి? ఎలాంటి విద్యార్హతలు ఉండాలన్న దానిపై ఒక అవగాహన ఉంటుంది. మనం దరఖాస్తులో ఎంత అందమైన భాష రాసినా, మన పదజాలం ఎంతగా ఆకట్టుకునే విధంగా ఉన్నా అది వాస్తవానికి విరుద్ధమైతే ఇంటిముఖం పట్టాల్సిందే. ఇంటర్నెట్‌లోకి వెళితే వందల వేల రకాల్లో సీవీలు కనిపిస్తాయి. భాష అటుఇటుగా అన్నీ ఒకేలా ఉంటాయి. వాటినే యధాతథంగా కాపీ చేసేస్తే వాస్తవం మరుగున పడిపోతుంది. అంతిమంగా ఆయా అభ్యర్థులకు నిరాశే మిగులుగుతుంది. మనం ఆశించే ఉద్యోగానికి తగ్గ ప్రతిభా సంపత్తులు లేకపోతే అది ఎప్పటికీ మనకు అందే అవకాశం ఉండదన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మాటలతో మభ్యపెట్టినట్టుగా మన అసలు ప్రతిభను దాచుకోలేం. ఎందుకంటే వాస్తవికత వేరు, పదాడంబరంతో రాసే సీవీలు వేరు. మనం రాసే ప్రతి అక్షరం మన అర్హతను చాటాలి. మన నిజమైన ప్రతిభను నిగ్గుతేల్చాలి. అలాంటప్పుడే అర్హతకు తగ్గ ఉద్యోగాలు అందివస్తాయి. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా అనేక సామాజిక మీడియాలు అన్ని రంగాలకు సంబంధించిన సమాచారంతో వెల్లువెత్తుతున్నాయి. అవకాశాలకు కొదవ లేకపోయినా వాటికి తగ్గ అర్హతలే కొరవడుతున్నాయి. మన చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా అందులో మన స్థానం, స్థాయి ఏమిటన్నదే మన తదుపరి మనుగడకు కొలమానం అవుతుంది. అదే అంతిమంగా గీటురాయి అవుతుంది. అందంగా రాసిన దరఖాస్తును పంపినంత మాత్రాన అర్హత లేకుండా ఆశించిన ఉద్యోగం అందివస్తుందన్నది పొరపాటే. నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న నేటి పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలే కాకుండా ఇతరత్రా నైపుణ్యాన్ని పెంపొందించుకోగలిగితే అదనపు అర్హతలతో కెరీర్ పథాన్ని బలోపేతాన్ని చేసుకోగలిగితే నిరాశకు తావుండదు. నిస్పృహకు చోటుండదు. నేటి యువత ఈ వాస్తవాన్ని గ్రహించాలి. అర్హతలను నిగ్గు తేల్చుకుంటూ నింగికే నిచ్చెన వేయవచ్చు. అయితే అందుకు తగ్గ పట్టుదల ఉండాలి. దానికి తగ్గ ప్రతిభ ఉండి తీరాలి.