యువ

గన్... ధనాధన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మరక్షణకు రకరకాల గాడ్జెట్లు అందుబాట్లో ఉన్నాయి. పెప్పర్‌స్ప్రే మొదలుకుని, కీచైన్‌లో దాగి ఉండే పదునైన చాకులాంటి ఆయుధం వరకూ రకరకాల గాడ్జెట్ల గురించి మనకు తెలుసు. అలాంటిదే మరొక గాడ్జెట్- టేజర్ పల్స్. చూడటానికి అచ్చం పిస్టల్‌లానే ఉంటుంది. కాబట్టి దీనిని చూసీ చూడగానే ఎదుటివ్యక్తి భయపడటం ఖాయం. అంతటితో దీని పని అయిపోలేదు. ట్రిగ్గర్ నొక్కితే ఇందులోంచి వెలువడే బులెట్లు ఎదుటి వ్యక్తిని కొద్దిసేపు అచేతనుణ్ని చేస్తాయి. ఈలోగా మనం తప్పించుకోవచ్చు. దీని బరువు కేవలం 0.5 పౌండ్లు మాత్రమే. హ్యాండ్‌బ్యాగ్‌లో తీసుకెళ్లొచ్చు. ఈ పిస్టల్ రేంజ్ 15 అడుగులు. దీనిని ఉపయోగిస్తే, శత్రువు 30 సెకన్లపాటు అచేతనుడైపోతాడు. టేజర్ పల్స్ ధర 372 డాలర్లు.