యువ

మారథాన్ లేడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారథాన్ రన్ అంటే మక్కువ చూపే అథ్లెట్లకు ఈ పేరు సుపరిచితమే. 45 ఏళ్ల వయసులో వరుస మారథాన్లలో విజయపతాకను ఎగురవేస్తున్న బబిత, తాజాగా హైదరాబాద్‌లో ముగిసిన 30వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 800, 1500, 5000 మీటర్ల విభాగాల్లో పతకాలను గెలుచుకున్నారు.
పరుగంటే ప్రాణమిచ్చే బబిత పరుగుపందేల్లో పాల్గొనడం మొదలుపెట్టి ముచ్చటగా మూడేళ్లు కూడా కాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె 2014లోనే తొలిసారిగా మారథాన్‌లో పాల్గొన్నారు. ఆ ఏడాది జనవరి 5న హైదరాబాద్‌లో ‘బ్రేక్‌ఫాస్ట్ రన్’ పేరిట జరిగిన మారథాన్‌లో సరదాగా పాల్గొన్నారట. అప్పటికి మారథాన్ అంటే ఏమిటో, ఎన్ని కిలోమీటర్లు పరుగెత్తాలో కూడా ఆమెకు తెలియదట.
సరదాగా పాల్గొన్న బబిత, తనకంటే ముందు పరుగెత్తుతున్న ఓ మహిళను చూసి, ఆమెను అనుసరిస్తూ పరుగెత్తుకుంటూ పోయారట. చివరకు పోటీ ముగిసిందట. అంతా ఆమెను అభినందిస్తుంటే అసలు ఎంత దూరం పరుగెత్తాను అని చూసుకుంటే 21 కిలోమీటర్లు అని తేలిందట. ఈ దూరాన్ని బబిత రెండు గంటల 34 నిమిషాల్లో అధిగమించారట. ఈ పోటీ అనంతరం హైదరాబాద్‌లో ఎక్కడ మారథాన్ జరిగినా హాజరు కావడం ఆమెకు రివాజుగా మారింది. వాస్తవానికి బబిత హైదరాబాదలోనే ఓ ఫిట్‌నెస్ ట్రెయినింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ‘చాలామంది మహిళలు ఫిట్‌నెస్‌కోసం టైమ్ కేటాయించలేమని అంటూ ఉంటారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లపై గంటల సమయం వెచ్చించేవారు ఫిట్‌నెస్‌కోసం సమయం లేదనడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది’ అంటారు బబిత.
బబిత గురించి తెలిసినవారు ఆమెను ‘మారథాన్ లేడీ’ అని పిలుస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే తాను మారథాన్లలో పాల్గొనగలుగుతున్నానని, బోస్టన్‌లో 2019లో జరిగే మారథాన్‌లో పాల్గొనాలన్నది తన జీవితాశయమని బబిత చెప్పారు.