యువ

పెట్ డాగ్స్‌కో బ్యాక్‌పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంపుడు కుక్కల్ని షికారు తీసుకెళ్లడం వీలవుతుందేమో కానీ, వాటితో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఇబ్బందే. చాలామంది కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కార్లు లేనివాళ్లు టూవీలర్స్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్తారు కానీ..అది ప్రమాదకరం. పెంపుడు కుక్కల్ని తీసుకెళ్లేందుకు తాజాగా మార్కెట్లోకి ఓ బ్యాక్‌పాక్ వచ్చింది. దాని పేరు కె9 స్టోర్ట్స్ శాక్ ఎయిర్ డాక్ బ్యాక్‌పాక్. పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకున్నట్టు దీనిని భుజాలకు తగిలించుకోవచ్చు. ఇందులో కుక్కను ఉంచేందుకు ఓ జిప్ ఉంటుంది. అది ఓపెన్ చేసి, అందులో కుక్కను కూర్చోబెడితే సరి. పైగా కుక్క తల బయటికే ఉంటుంది కాబట్టి గొడవే లేదు. బ్యాక్‌పాక్‌కు అటూ ఇటూ రెండువైపులా ఉండే ప్యాకెట్లలో వాటర్‌బాటిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్‌పాక్ ధర 80 డాలర్లు.