యువ

రైతుకు వెన్నుదన్ను కనెక్ట్ ఫార్మర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొలంలో దిగాక రైతుకు ఎదురయ్యే కష్టనష్టాలకు అంతే ఉండదు. మన దేశంలో చాలామంది రైతులు నిరక్షరాస్యులే. పరితాపమే తప్ప పరిష్కారం కనిపెట్టే చొరవ, తెలివితేటలూ తక్కువ.
కానీ...ఓ విద్యాధికుడికే అలాంటి కష్టాలు ఎదురైతే అందుకు పరిష్కారం కనుక్కుంటాడు. తనతోపాటు మిగిలిన రైతులనూ ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తాడు. కర్ణాటకకు చెందిన 27 ఏళ్ల యువకుడు శ్రీకృష్ణ అందుకు నిదర్శనం.
ఉత్తర కన్నడ ప్రాంతంలోని బిద్రకన్ అనే గ్రామానికి చెందిన శ్రీకృష్ణ హెగ్డే అందరిలానే ఓ సాధారణ యువకుడు. సిఎ చదివి జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో పట్నం చేరాడు. ఆర్టికిల్‌షిప్ పూర్తి చేశాడు. అయితే పట్టణ వాతావరణం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. గ్రామంలో పుట్టిపెరిగిన శ్రీకృష్ణ...పట్టణాల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం ఉండటం, వారంతా ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయేంత బిజీగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉండటం...శ్రీకృష్ణకు నచ్చలేదు. దాంతో స్వగ్రామానికి తిరుగుముఖం పట్టాడు.
శ్రీకృష్ణ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. పొద్దస్తమానం పొలంలోనే గడిపే తల్లిదండ్రులతోపాటు తీరిక చిక్కినప్పుడలా శ్రీకృష్ణ కూడా పొలం పనుల్లో పాలు పంచుకునేవాడు. దాంతో వ్యవసాయం పట్ల మక్కువ పెరిగింది. ఉత్తర కన్నడ ప్రాంతంలో వాక్కాయ పంట ఎక్కువ పండిస్తారు. ప్రధాన పంట కాకపోయినా, విలువ ఆధారిత పంటగా బాగుంటుందని శ్రీకృష్ణ స్వయంగా సాగు చేశాడు. పంట బాగానే పండింది కానీ, దానిని మార్కెట్‌కు తీసుకెడితే మాత్రం కొనేవారే కరువయ్యారు. శ్రీకృష్ణ విస్తుపోయాడు. వాక్కాయ వంటి విలువ ఆధారిత పంటలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే దళారులకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు. దాంతో అలాంటి పంటలను కొనేందుకూ, కొనిపించేందుకూ ఎవరూ ఆసక్తి చూపించరు. అదీ అసలు కారణం. మరోవైపు వరి, చెరకు వంటి ప్రధాన పంటలు పండించే రైతులు మార్కెట్ యార్డుల్లో నిలువు దోపిడీకి గురవుతున్నారు. నాణేనికి రెండు వైపులా ఉన్న ఈ భిన్న పార్శ్వాలను గమనించాక, దీనికో పరిష్కారం కనుక్కోవాలని శ్రీకృష్ణ నడుం బిగించాడు. వ్యవసాయ నిపుణుల్ని కలిశాడు. వ్యవసాయం పట్ల అనురక్తి, రైతులంటే అభిమానం ఉన్న నలుగురు సహచరులకు తన ఐడియా చెప్పాడు. అంతా సరేననడంతో ‘కనెక్ట్ ఫార్మర్’ పేరిట ఓ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌కు తెరతీశాడు. ఇక్కడ మధ్యదళారులు ఉండరు. పంటను రైతే మోసుకుంటూ మార్కెట్ యార్డుకు తీసుకెళ్లే ప్రయాస ఉండదు. రైతులనుంచి తక్కువ ధరకు కొని, ఎక్కువకు అమ్ముకునే కుయుక్తులకు పాల్పడేవారు ఉండరు. అంతా ఆన్‌లైన్. పైగా పంట అమ్ముడుపోయిన మొత్తంలో కొద్దిమొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా మినహాయించుకుని, మిగిలినదంతా రైతుకే ఇచ్చేస్తారు. ఇదీ ‘కనెక్ట్ ఫార్మర్’ పనిచేసే విధానం. ఇందులో మరింత సాధికారత సాధించేందుకు శ్రీకృష్ణ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డిప్లొమో చేసి, జర్మనీ నుంచి ఇదే సబ్జెక్ట్‌లో ఫెలోషిప్ చేశాడు.
‘కనెక్ట్ ఫార్మర్’లో సభ్యులైన రైతులకు విత్తు నాటడం మొదలుకుని పంటను విక్రయించుకునేవరకూ శ్రీకృష్ణ బృందం తోడూనీడగా నిలుస్తుంది. విత్తు నాటేటప్పుడే కావలసిన సలహాలు ఇస్తారు. వ్యవసాయ నిపుణుల్ని పొలం వద్దకే తీసుకొస్తారు. చీడపీడల గురించి రైతుల్లో అవగాహన పెంచుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా మధ్య దళారుల ప్రమేయం ఉండదు. ప్రస్తుతం ‘కనెక్ట్ ఫార్మర్’లో ఐదువేలమంది వరకూ సభ్యులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు అధిక ధరకు తమ పంటను అమ్ముకోగలుగుతున్నారు. దీంతో ‘కనెక్ట్ ఫార్మర్’లో సభ్యులుగా చేరేందుకు ఇతర రైతులూ ఆసక్తి చూపిస్తున్నారు.
తాను సాధించిన విజయంపై శ్రీకృష్ణ సంతృప్తిగా లేడు. వ్యవసాయం నుంచి మధ్యదళారుల ప్రమేయం పూర్తిగా పోయినప్పుడే రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందంటాడతను. యువకులు గ్రామాలను వదిలి, ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాల బాట పట్టడం తగ్గాలని శ్రీకృష్ణ అభిప్రాయపడ్డాడు. వ్యవసాయం కడుపు నింపదన్న భావన యువతలో బలంగా నాటుకుపోయిందని, అది తప్పని అన్నాడు. విద్యాధికులు వ్యవసాయరంగంలోకి అడుగు పెడితే రైతులకు ఓ అండ దొరుకుతుందని అతను అన్నాడు.

చిత్రం.... కృష్ణ