యువ

వయొలిన్ రాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలం కుర్రకారు మ్యూజిక్ అంటే జాజ్, గిటార్, కీబోర్డు వంటి పాశ్చాత్య వాయిద్యాలనే ఎంచుకుంటారు. ఇక వయొలిన్ జోలికి ఎవరు వెళ్తారు? అయితే హైదరాబాద్‌కు చెందిన పీసపాటి శాండిల్య చిన్నప్పుడే వయొలిన్‌పై మనసు పారేసుకున్నాడు. అదే శ్వాసగా, అదే ధ్యాసగా అందులోనే మునిగి తేలాడు. ఇప్పుడు అతనే టాలీవుడ్‌లో సంచలనాలకు కేంద్రబిందువవుతున్నాడు.
రాబోయే పవన్ కల్యాణ్ సినిమా ‘కాటమరాయుడు’లోని లాగె..లాగె అనే పాటలో శాండిల్య వయొలిన్ విన్యాసాలు వినవచ్చు. ఇదొక్కటేనా? శాండిల్య ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 21 ఏళ్ల శాండిల్య... పిల్లా నువ్వు లేని జీవితం, మనం, గోపాలా..గోపాలా వంటి సినిమాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
వయొలిన్ పట్ల ఇష్టం ఎలా ఏర్పడిందని ప్రశ్నిస్తే...తండ్రి ప్రోత్సాహంతోనే తాను వయొలిన్ చేతబట్టానని శాండిల్య చెప్పాడు. ఏదో ఒక వాయిద్యం నేర్చుకోమని ఆయన ఇచ్చిన సలహాతో ఆరో ఏటే వయొలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టానన్నాడు. అశోక్ గుర్జాల వద్ద కొంతకాలం అభ్యాసం చేసి, వయొలిన్ వాయించడంలో మెలకువలు నేర్చుకున్నానని, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జోస్యభట్ల శర్మవద్ద శిష్యరికం చేశానని వివరించాడు.
‘దిల్ దివానా’ సినిమాకు పని చేయడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శాండిల్యకు ఆ తరువాత వరుసగా అవకాశాలు లభించాయి. వంశీకృష్ణ, సాయి కార్తీక్ వంటి డైరెక్టర్ల వద్ద పనిచేసి, అనుభవం సంపాదించాడు. అతనిలోని ప్రతిభను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గుర్తించడంతో శాండిల్య దశ తిరిగింది. అనూప్ చేసే ప్రతి సినిమాలోనూ శాండిల్యకు అవకాశాలు లభిస్తున్నాయి.
సంగీతం పట్ల అనురక్తి ఉన్నా, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదంటాడు శాండిల్య. కాలేజీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌కు వెడతానని, రికార్డింగ్స్ కూడా రాత్రివేళల్లోనే ఉండేట్లు చూసుకుంటున్నానని చెబుతున్న శాండిల్య, ఫ్యూజన్ మ్యూజిక్‌లో పేరొందిన డెనిక్ గ్రూవ్స్ బ్యాండ్‌లో వయొలనిస్ట్‌గా పనిచేస్తున్నాడు కూడా. భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్‌గా స్థిరపడాలన్నది తన ఆశయమంటున్నాడు శాండిల్య.