యువ

వెలుగులీనిన తెలుగు తేజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రాణీ దాస్ గురించి ఇప్పుడు పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’ గెలుచుకున్న అమ్మాయిగా ఆమె పేరు పత్రికల్లో మార్మోగిపోయింది కాబట్టి.
అయితే ఆమె గురించి, ఆమె పాల్గొన్న రీజెనారన్ సైన్స్ టాలెంట్ సెర్చి కాంపిటీషన్ గురించి మాత్రం తెలుసుకోవలసిందే.
ఇంద్రాణి అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన అమ్మాయే అయినా, ఆమె మూలాలు మాత్రం ఇండియాలోవే. తల్లిదండ్రులతోపాటు చిన్నప్పుడే ఇంద్రాణి అమెరికా వెళ్లిపోయింది. పదిహేడేళ్ల వయసులోనే ఆమె ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’గా అభివర్ణించే రీజెనారన్ సైన్స్ టాలెంట్ సెర్చి కాంపిటీషన్‌లో పాల్గొని ప్రథమ బహుమతిగా 2,50,000 డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకోవడంతో తాజాగా వార్తల్లో నిలిచింది.
ఇంద్రాణికి చిన్నప్పటినుంచీ సైన్స్ అంటే ప్రాణం. ఆ దిశగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండేది. ‘ఆస్ట్రోగ్లియోసిస్’పై చేసిన ప్రయోగం ఆమెకు జూనియర్ నోబెల్ బహుమతిని సంపాదించిపెట్టింది. కణాలలోని న్యూరాన్లు విధ్వంసమైతే ఏర్పడే పరిస్థితిని ఆస్ట్రోగ్లియోసిస్ అంటారు. ఆస్ట్రోసైట్స్ అనే కొన్ని కణాల సమూహం శరీరానికి గాయాలు తగిలినప్పుడు లేదా ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు అనూహ్యమైన సంఖ్యలో పెరిగిపోవడం మొదలవుతుంది. ఆస్ట్రోసైట్స్ సంఖ్య పెరిగితే న్యూరాన్లు దెబ్బతింటాయి. దీనివల్ల మనిషికి కోలుకోలేని దెబ్బ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూరాన్లను ఎలా సంరక్షించవచ్చో ఇంద్రాణి తన ప్రయోగాల ద్వారా నిరూపించింది. కీలకమైన ఈ పరిశోధన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన బహుమానాన్ని సంపాదించిపెట్టింది.
విచిత్రమేమంటే...అమెరికాలోనే అతి పురాతనమైన సైన్స్ సెర్చ్ టాలెంట్ టెస్ట్‌గా పరిగణించే రిజెనారన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ టాలెంట్‌లో 1700మంది విద్యార్థులు పాల్గొంటే అందులో చాలామంది ప్రవాస భారతీయ విద్యార్థులే ఉండటం. మూడో బహుమతిగా 1,50,000 డాలర్ల ప్రైజ్ మనీ సంపాదించిన అర్జున్ రమణి, ఐదో స్థానంలో నిలబడిన అర్చనా వర్మ, ఏడో స్థానం సంపాదించిన ప్రతీక్ నాయుడు ప్రవాస భారతీయ విద్యార్థులే.
అమెరికాలోని సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ది పబ్లిక్ అనే సంస్థ 1942నుంచీ సైన్స్ టాలెంట్ సెర్చ్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలో దీనినే అతి పురాతనమైన టాలెంట్ సెర్చ్‌గా పరిగణిస్తారు. సైన్స్‌లోనూ, గణితంలోనూ ప్రతిభాపాటవాలను కనబరిచే యువతను పసిగట్టి, వారిని ప్రోత్సహించడం ఈ సెర్చ్ టాలెంట్ ఉద్దేశం. 1942నుంచి 55 ఏళ్లపాటు ఈ సైన్స్ టాలెంట్ సెర్చ్‌కి ప్రముఖ సంస్థ వెస్టింగ్‌హౌస్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
ఆ తర్వాత 2016 వరకూ ఆ బాధ్యతను ఇంటెల్ స్వీకరించింది. ఈ ఏడాదినుంచి రీజెనారన్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ పదేళ్లపాటు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. రీజెనారన్ సంస్థ స్పాన్సర్‌షిప్ బాధ్యతలు తలకు ఎత్తుకున్న వెంటనే ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ‘విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసి, వారిని ప్రోత్సహించి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వారి తెలివితేటల్ని వినియోగించడమే ఈ సైన్స్ టాలెంట్ లక్ష్యం’ అంటారు మాయా అజ్మేరా. సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ది పబ్లిక్ సంస్థకు ఆమె సిఇఓగా వ్యవహరిస్తున్నారు.
సైన్స్ టాలెంట్ సెర్చ్‌కి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న రీజెనారన్..ఓ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ. అనేక రకాల వ్యాధులపై పరిశోధనలతోపాటు ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు కనిపెట్టడంలో అగ్రగామిగా వెలుగొందుతోంది.

ఇంద్రాణిదాస్ (మధ్యలో)