యువ

సెల్ఫ్ డ్రైవింగ్ వ్యాన్ రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యాన్‌ను చూశారా? ‘వ్యానే కదా..వింతేముంది’ అనుకుంటున్నారు క దూ! అది మామూలు వ్యాన్ కాదండీ. డ్రైవర్‌లెస్ వ్యాన్. అది కూడా ప్రజా రవాణాకోసం రూపొందించిన వ్యాన్ మరి. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ దీనికి ఉండవు. ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. బ్యాటరీతో నడిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే ఈ వ్యాన్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో ఉండేవి ఆరు సీట్లే. ఇంతకీ ఈ వ్యాన్ పేరు చెప్పలేదు కదూ! దీని పేరు వీపాడ్. నెదర్లాండ్స్‌లోని వాగెనింగ్‌జెన్ యూనివర్శిటీలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపి పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో వీపాడ్‌ను రోడ్ల మీదకు తీసుకురావాలన్నది నెదర్లాండ్స్ ప్రభుత్వం యోచన.