యువ

గుండెపోటుకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృద్రోగులకు ఊరటనిచ్చే సంఘటనలు ఇటీవలికాలంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ యువ న్యాయవాది ఆకాశాన్నంటే స్టెంట్ల ధరలపై న్యాయ పోరాటం సాగించి, వాటిని భూమార్గం పట్టించాడు. ఇప్పుడు ముక్కుపచ్చలారని ఓ పదిహేనేళ్ల యువకుడు ‘సైలంట్ హార్ట్ అటాక్స్’ను కనిపెట్టే పరికరాన్ని సృష్టించి, అందరి ప్రశంసలకూ పాత్రుడవుతున్నాడు. ఆ కుర్రాడి పేరు ఆకాశ్ మనోజ్.
తమిళనాడుకు చెందిన ఆకాశ్ చదువుతున్నది ఇంటర్‌మీడియట్ అయినా, వైద్య పరిజ్ఞానం ఎక్కువ. ఎనిమిదో తరగతినుంచే మెడికల్ జర్నల్స్ చదవడం అలవాటు చేసుకున్నాడు. రోజూ హొసూరులోని తన ఇంటికి కూతవేటు దూరంలో ఉండే ఓ లైబ్రరీకి వెళ్లి రోజూ రెండు గంటల పాటు క్రమం తప్పకుండా మెడికల్ జర్నల్స్ చదువుతాడు. ఈ అలవాటే అతనికి వివిధ రకాల రోగాలపై అవగాహన పెరిగేందుకు దోహదపడింది.
సాధారణంగా గుండెపోటుకు కొన్ని రోగ లక్షణాలు ఉంటాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వగైరా. అయితే హఠాత్తుగా వచ్చే సైలంట్ హార్ట్ అటాక్‌కు మాత్రం ఇలాంటి లక్షణాలేమీ ఉండవు. అకస్మాత్తుగా మనిషిని కబళిస్తుంది. సైలంట్ హార్ట్ అటాక్ వచ్చే ముందు గుండె ఎఫ్‌ఎబిపి 3 అనే ప్రోటీన్‌ను స్వల్పమాత్రంలో విడుదల చేస్తుంది. దీనిని పసిగట్టగలిగితే ఈ గుండెపోటును ఎదుర్కోవచ్చు. ఓ మెడికల్ జర్నల్‌లో చదవిన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆకాశ్ ఓ స్కిన్ ప్యాచ్‌ను తయారు చేశాడు. దీనిని చేతి మణికట్టుపైగానీ, చెవి వెనుక భాగంలోగాని అతికించుకోవచ్చు. గుండె ఎఫ్‌ఎబిపి 3 ప్రోటీన్‌ను విడుదల చేసినప్పుడు ఈ స్కిన్ ప్యాచ్ మనల్ని అప్రమత్తం చేస్తుంది. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైలంట్ హార్ట్ అటాక్‌నుంచి బయటపడవచ్చు.
తాను తయారు చేసిన స్కిన్ ప్యాచ్‌కు పేటెంట్ హక్కుకోసం దరఖాస్తు చేశానని, దీని ఫార్ములాను ప్రైవేట్ సంస్థలకు అమ్మే బదులు, ప్రభుత్వమే తీసుకోవాలని, తద్వారా జనానికి మేలు జరుగుతుందని ఆకాశ్ అంటున్నాడు.
ఆకాశ్ రూపొందించిన స్కిన్ ప్యాచ్‌పై శాస్తవ్రేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చిన నేపథ్యంలో మరో రెండు నెలల్లో ఆకాశ్ కనిపెట్టిన స్కిన్ ప్యాచ్ వాడకంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

చిత్రం..ఆకాశ్ మనోజ్