యువ

బొమ్మలిచ్చే అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం..
హిరిన్ ఇల్లంతా సర్దుతోంది. ఆమె ఏడేళ్ల కూతురు జియా తన తల్లికి పనిలో సాయం చేస్తోంది. అలమారా సర్దుతుంటే అందులో ఉన్న బొమ్మలన్నీ కింద పడ్డాయి. అవన్నీ జియా చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు. వాటిని చూసి జియా.. ‘అమ్మా..వీటితో నేనిప్పుడు ఆడుకోవడం లేదు కదా... ఎవరికైనా ఇచ్చేయి’ అంది.
ఆ చిన్నారి మాటలు హిరిన్‌ను ఆలోచనలో పడేశాయి. ఆ ఆలోచనల్లోంచి ఓ వినూత్నమైన పథకం ఆవిర్భవించింది. ఆ పథకమే ఇప్పుడు నిరుపేద చిన్నారుల మొహాలపై చిరునవ్వులు విరబూయిస్తోంది. ఆ పథకం పేరు...‘గివ్ టాయ్.. గివ్ జాయ్’!
బొమ్మలతో పిల్లలది విడదీయరాని సంబంధం. మరోమాటలో చెప్పాలంటే చిన్నారుల మానసిక పరిణతి ఎదిగేందుకు బొమ్మలు తోడ్పడతాయి. బొమ్మలతో ఆడుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటిని కొనే స్థాయి మాత్రం అందరికీ ఉండదు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకోసం కొన్న బొమ్మలు కొన్నాళ్లకు పాతపడిపోతాయి. పిల్లలు ఎదిగే క్రమంలో అవి అటకెక్కుతాయి. కొత్త బొమ్మలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలా అటకెక్కిన పాత బొమ్మల్ని.. బొమ్మలు కొనే తాహతు లేని వారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే కాన్సప్ట్‌తో హిరిన్ రంగంలోకి దిగింది. అయితే తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం మాత్రం ఆమెకు అంత తేలిగ్గా సాధ్యపడలేదు. పాత బొమ్మలు ఇవ్వమని అడిగితే రేపిస్తాం.. మాపిస్తాం అంటూ తప్పించుకునేవారట. మరికొంతమంది.. ఈ బొమ్మలను హిరిన్ అమ్ముకుంటుందేమోనని అనుమానంగా చూసేవారట. దాంతో హిరిన్ సోషల్ మీడియాను ఆశ్రయించింది. తన ఆశయాన్ని విడమరచి చెప్పడంతో చక్కటి స్పందన లభించింది. దాంతో కార్యాచరణలోకి దిగిందామె.
ప్రతి శనివారం హిరిన్ బొమ్మలను ఇంటింటికీ తిరిగి సేకరిస్తుంది. ఆదివారంనాడు ఆమె కొన్ని ప్రభుత్వేతర సంస్థలతో కలసి మురికివాడలకు వెళ్లి, అక్కడ చిన్నారులకు బొమ్మలు అందజేస్తుంది. వారితో కలసి ఆడుతుంది. వారి మొహాల్లో ఆనందం చూశాకగానీ ఆమె అక్కడినుంచి కదలదు. ఇలా ఆమె ఒక ఏడాది సమయంలో అహ్మదాబాద్‌లో రెండు వేలమంది పిల్లలకు బొమ్మలు అందజేసింది.
కేవలం హిరిన్ అంతటితో సరిపెట్టుకోలేదు. నిరుపేద కుటుంబాల్లోని చిన్నారులకోసం ఆమె అహ్మదాబాద్‌కే చెందిన డాక్టర్ ప్రకాశ్ వైష్ణవ్‌తో కలసి వైద్య శిబిరాలూ నిర్వహిస్తుంది. శిబిరంలో పిల్లలకు అందజేసే మందులకోసం ఆమె నిధులు సేకరిస్తోంది.
తాను చేపట్టినది ఘన కార్యమేమీ కాదంటుంది హిరిన్. బొమ్మలే కాదు...ప్రతి ఇంట్లోనూ పుస్తకాలు కూడా ఇలాగే అటకలకు ఎక్కుతున్నాయి. వాటిని వాడరు సరికదా... ఇతరులకు ఇవ్వడానికీ తల్లిదండ్రులు ఇష్టపడరు. దీనివల్ల చదువుకోవాలని ఉన్నా, పుస్తకాలు కొనలేని చిన్నారులకు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. తమ వద్ద వృథాగా ఉన్న వస్తువులు ఇతరులకు ఉపయోగపడే పక్షంలో వాటిని ఇవ్వడానికి వెనుకాడటం తగదంటారామె.

చిత్రం..పిల్లలకు బొమ్మలు అందజేస్తున్న హిరిన్