యువ

బెంగళూరులో ‘శివ’ గంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చింది. నీటి ఎద్దడీ మొదలైంది.
ఆ కాలనీకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. చుట్టూ జనం మూగుతున్నారు. రాజు-పేద అనే తేడా లేకుండా అందరూ బకెట్లు, బిందెల్లో నీళ్లు తీసుకెళ్తున్నారు.
ఒక్క ఇంట్లోంచి మాత్రం చడీ చప్పుడూ లేదు. ఆ మాటకొస్తే...ఆ ఇంట్లో వాళ్లు అసలు వాటర్ బిల్లే కట్టడం లేదు. దానర్థం ప్రభుత్వం సరఫరా చేసే నీటిని వాడుకుంటూ బిల్లు కట్టడం లేదని కాదు. అసలు వాళ్ల ఇంట్లో వాటర్ కనెక్షనే లేదు. అదే విచిత్రం.
అదెలా సాధ్యం?
ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
మనం పైన చెప్పుకున్న కాలనీ బెంగళూరులోనిది. ఆ ఇల్లు శివకుమార్ అనే ఓ సైంటిస్టుది. కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలో పనిచేసే శివకుమార్ 1995లో ఇల్లు కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఆయన చేసిన పని... తన కాలనీలో చుట్టుపక్కల వారికి వస్తున్న వాటర్ బిల్లులను అధ్యయనం చేయడం. ఒక్కొక్క ఇంట్లో ఏడాదికి సగటున ఎన్ని లీటర్ల నీళ్లు వాడుతున్నారని గమనించారు. నలుగురు ఉన్న ఇంట్లో సాధారణంగా రోజుకూ 500 లీటర్ల నీటి వాడకం జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు నగరంలో వర్షపాతం ఎలా ఉందనేది పరిశీలించారు. వర్షపాతం బాగానే ఉంటోందనీ, అయితే వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే చర్యలేవీ లేకపోవడంతోనే నగరాన్ని నీటి ఎద్దటి పట్టి పీడిస్తోందని గమనించారు. ఆ మేరకు తన ఇంట్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు.
ముందుగా ఇంటిపైన వాటర్ ట్యాంకులను నిర్మించారు. వీటి సామర్థ్యం 45 వేల లీటర్లు. వాటికి పాప్ అప్ ఫిల్టర్లు బిగించారు. ఇవి నీటిని వడపోస్తాయన్నమాట. ఈ ఫిల్టర్ల రూపకర్త శివకుమారే కావడం విశేషం. ఇక నేలపై పడే వర్షపు చినుకులనూ వృథా పోనివ్వకుండా ఇంటి చుట్టూ పెర్కొలేషన్ పిట్స్ తవ్వించారు. విచిత్రమేమంటే... ఈ పిట్స్ తవ్వించిన ఏడాదికల్లా ఆయన ఇంటి ఆవరణలో భూగర్భ జల మట్టం విపరీతంగా పెరిగిందట.
ఇంట్లో వినియోగించే నీళ్లనూ శివకుమార్ వృథాగా పోనివ్వడం లేదు. వాషింగ్ మెషీన్‌లో ఉపయోగించే నీటిని ఓ ప్రత్యేకమైన ట్యాంక్‌లో నిల్వ చేసి, ఆ నీటిని టాయిలెట్లలో వినియోగించే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే కిచెన్‌లో ఉపయోగించే నీటిని గార్డెనింగ్‌కు ఉపయోగపడేలా చేశారు.
గత ఇరవై ఏళ్లుగా శివకుమార్ కుటుంబం కేవలం వర్షపు నీటినే వినియోస్తోంది. ఆయనను చూసి అనేకమంది బెంగళూరు వాసులు స్ఫూర్తినొంది, వర్షపు నీటి వినియోగంపై మక్కువ పెంచుకున్నారు. కర్ణాటక విధాన సౌధ, హైకోర్టు, అరవింద్ మిల్స్, ఇంటెల్ ఇండియా వంటి కార్పొరేట్ కార్యాలయాలు, అనేక ఇళ్ల కాలనీలకు శివకుమార్ వర్షపు నీటిని ఒడిసిపట్టడంపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డులో పనిచేసే ప్లంబర్లు, బిల్డింగ్ కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులకు శివకుమార్ ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. అంతకుమించి, 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు వర్షపు నీటి వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం చేయడం వెనుక శివకుమార్ కీలక పాత్ర పోషించారు. శివకుమార్ గురించి తెలిసిన మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటి వినియోగంపై ఆయన సలహాలను తీసుకుంటోంది. ‘మనిషికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని ప్రకృతే మనకు చెబుతుంది. నిజానికి, బెంగళూరు నగరంలో వర్షపాతం గతంలో కంటే బాగా పెరిగింది. కానీ, వర్షపు నీటిని వినియోగించుకోకపోవడంతోనే నీటి ఎద్దడి పెరుగుతోంది. నగరంలో కనీసం సగం ఇళ్లయినా వర్షపు నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోగలిగితే బెంగళూరుకు నీటి ఎద్దడే ఉండదు’ అంటారు శివకుమార్.