యువ

ఇంట్లోనే మబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో తిరిగే మబ్బులు నేరుగా ఇంట్లోకే వచ్చేస్తే ఎలాగుంటుంది? థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ! ఈ అసాధ్యాన్ని రిచర్డ్ క్లార్క్‌సన్ స్టూడియో సుసాధ్యం చేసింది. ఫ్లోటింగ్ క్లౌడ్ పేరిట బుల్లి బుల్లి మబ్బుల్ని ఇంట్లో తిరిగేలా చేసే టెక్నాలజీని సృష్టించి, ఈ స్టూడియో అందర్నీ ఔరా అనిపిస్తోంది. వాస్తవానికి ఇటో బ్లూటూత్ స్పీకర్. దీనికి మబ్బుల హంగులద్ది దానిని గాల్లో ఎగిరేలా చేశారు. ఫ్లోటింగ్ క్లౌడ్ ఓ బేస్‌కు అనుసంధానమై ఉంటుంది. బేస్‌ను ప్లగ్‌తో కనెక్ట్ చేసి ఉంచాలి. బేస్‌లోనూ, క్లౌడ్‌లోనూ ఉన్న మేగ్నట్ల వల్ల క్లౌడ్.. బేస్‌కు రెండు అంగుళాల పైన ఎగురుతున్నట్టు ఉంటుందన్నమాట. అలాగే ఫ్లోటింగ్ క్లౌడ్‌లో అమర్చిన సౌండ్ రియాక్టివ్ ఎల్‌ఇడి లైట్ల వల్ల ఈ గాడ్జెట్‌కు మరింత వనె్న చేకూరింది.