యువ

ఇంటిని మడత పెట్టేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐఐటి మద్రాస్ విద్యార్థుల వినూత్న ప్రయోగం

మీరుండే ఇంటిని మడత పెట్టేసి, ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకుపోయే వీలుంటే ఎలా ఉంటుంది? అసలు ఈ ఆలోచనే థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఇలాంటి ఆలోచనకు ఐఐటి మద్రాస్ స్టూడెంట్లు కార్యరూపమిచ్చి, ఔరా అనిపించారు. వారు మడత పెట్టేసింది ఒకటో రెండో రూముల ఇల్లు కాదు...ఏకంగా 20 మంది వరకూ నివసించే రెండంతస్థుల ఇంటిని మరి! మద్రాస్ ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్లకు ఓ ఆలోచన వచ్చింది. ఇంటిని విడదీసి, మరోచోటకు తీసుకుపోగలిగేలా నిర్మించాలని. అనుకున్నదే తడవు 52 అడుగుల పొడవూ, వెడల్పూ కలిగిన ఇంటిని కట్టేశారు. నిర్మాణంలోనే గోడలకు బదులు మెటల్ ఫ్రేములు ఉపయోగించారు. వీటిని అవసరమైతే విప్పి, మరోచోటకు తరలించే వీలు ఉండేలా బిగించారు. కరెంటు, నీటి సరఫరా విషయంలోనూ అడ్డంకులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ఏ గదికి ఆ గది విడదీసి, తీసుకువెళ్లే వీలున్నా ఒక్క టాయిలెట్ల విషయంలో మాత్రం వారి ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే వీటిని ప్రత్యేకమైన క్యూబికల్స్‌గా నిర్మించడంతో అలాగే పట్టుకువెళ్లచ్చు. ఈ ప్రయోగంలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి నాయకత్వం వహించిన శ్రీరామ్ మాట్లాడుతూ తాము చేసిన ఈ ప్రయోగం భవిష్యత్తులో ఎంతోమందికి ఉపయుక్తం అవుతుందని అన్నాడు. ముఖ్యంగా తుఫానులు, వరదలు సంభవించినప్పుడు ఎన్నో ఇళ్లు కొట్టుకుపోతాయని, గత ఏడాది చెన్నైలో వరదలు వచ్చినప్పుడు వేలాది ఇళ్లు పాడైపోయాయని, తాము నిర్మించిన ఇలాంటి ఇళ్లు చెక్కుచెదరవని ధీమా వ్యక్తం చేశాడు. తాము నిర్మించిన ప్రొటోటైప్ ఇంటిని జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు ఓ స్టార్టప్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు శ్రీరామ్ చెప్పాడు. బహుశా తాము నిర్మించే ఇల్లు ఒక్కొక్కటి మూడు లక్షల రూపాయలకు మించకపోవచ్చని అన్నాడు.